
ఆరోగ్యం కోసం చాలామంది హెవీ వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ, ఫిట్‌నెస్ నిపుణులు మాత్రం రోజూ నడవడం ఎంతో మేలని సూచిస్తున్నారు. అప్పుడప్పుడు తీవ్రమైన వ్యాయామం చేయడం కంటే, ప్రతిరోజూ కొంతసేపు నడవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
రోజుకు 20-30 నిమిషాలు నడవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తపోటును నియంత్రించి, డయాబెటిస్ నివారణలో సహాయపడుతుంది.
ఎండార్ఫిన్స్ విడుదల చేసి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.
బరువు నియంత్రణ, ఎముకల బలం, మెరుగైన నిద్రకు వాకింగ్ ఉత్తమం.
డైలీ వాకింగ్: గుండెకు రక్షణ, రక్తపోటు నియంత్రణ
ఆరోగ్యం కోసం, ఫిట్‌నెస్ కోసం రకరకాల వ్యాయామాలు ప్రయత్నిస్తుంటారు కొందరు. మరికొందరు వీక్లీవన్స్ హెవీ వర్కవుట్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ.. వీటన్నింటికంటే డైలీ వాకింగ్ ఎంతో బెటర్ అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎప్పుడో ఒకసారి తీవ్రమైన వ్యాయామం చేసి, మిగతా రోజులు కూర్చొని ఉండటం కంటే.. రోజూ కొంతసేపు నడవడం మీ శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుందని చెబుతున్నారు. ఇంకా ఏయే ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు నడవడం మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. డైలీ వాకింగ్ వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణలో నడక పాత్ర
డైలీ వాకింగ్ మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని, ఇది ఎండార్ఫిన్స్ విడుదల చేసి స్ట్రెస్, ఆందోళనలను తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఒక్కసారి ఇంటెన్స్ వర్కౌట్ చేయడం కంటే రోజూ చిన్న చిన్న నడకలు అలవాటు చేసుకోవడం సులభమే కాకుండా.. ఆరోగ్యానికి మంచిది. పైగా ఇలా దీర్ఘకాలికంగా వాకింగ్ చేయడంవల్ల అలవాటుగా మారి, ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఇందుకోసం జిమ్ లేదా ఖరీదైన సామగ్రి అవసరమే లేదు. సౌకర్యవంతమైన షూస్ ఉంటే చాలు.
ఒక్కసారిగా చేసే పెద్ద ప్రయత్నాలకంటే.. రోజువారీగా చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మెరుగైన ఫలితాలను ఇస్తాయి అంటారు పెద్దలు. వాకింగ్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. వారంలో ఒక్కరోజు మాత్రం భారీగా వ్యాయామం చేస్తే శరీరం ఒత్తిడికి గురవుతుంది. గాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ రోజూ చేసే నడక సాధారణంగా సురక్షితమే కాకుండా సులభం కూడాను. పైగా వాకింగ్ ఎవరైనా చేయగలుగుతారు. అంతేకాకుండా ఇది బరువు నియంత్రణ, ఎముకల బలం, మెరుగైన నిద్ర, మొత్తం ఆయుష్షు పెంచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతిరోజూ కొంతసేపు నడవడం ఉత్తమం అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
మానసిక ప్రశాంతతకు వాకింగ్ ఎలా?
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
మొత్తంగా చూస్తే, హెవీ వర్కవుట్స్‌పై ఆధారపడకుండా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది సులభమైన, ఖర్చులేని మార్గం. ఆరోగ్యకరమైన జీవితం కోసం డైలీ వాకింగ్‌ను అలవాటు చేసుకోండి.


