
📌 Key Points
- స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం రద్దు వెనుక కారణాలు బయటకు రాలేదు!
- పలాష్ చాలా మంచి వ్యక్తి అని బాలీవుడ్ నటి డైసీ షా కితాబు!
- డైసీ కామెంట్స్ వెనకాల పలాష్‌ను కాపాడటమేనా? నెటిజన్స్ అనుమానాలు!
- WPL 2026లో బెంగళూరు జట్టుకు స్మృతి నాయకత్వం, కప్పు సాధించి రికార్డు!
టాలీవుడ్‌లో మరో షాకింగ్ న్యూస్! స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం రద్దు కావడం సంచలనం రేపుతోంది. ఈ వివాదంపై బాలీవుడ్ నటి డైసీ షా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
స్మృతి మందాన పెళ్లి రద్దుకు కారణాలేంటి?
భారత మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం వివిధ కారణాలతో పెళ్లి పీటల మీదనే రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి రద్దు వెనుక ప్రధాన కారణాలు బయటకి రాకపోయినా… పలాష్ వల్లే వివాహం ఆగిపోయిందనే వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా బాలీవుడ్ నటి డైసీ షా వీరిద్దరి వివాహం రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసారు. “పలాష్ వ్యక్తిగతంగా చాలా సంస్కారవంతుడు. మంచి మనసున్న వ్యక్తి. దేవుడిని బలంగా నమ్మే వ్యక్తులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటారు, పలాష్ కూడా అదే కోవకు చెందిన వాడు” అని ఆమె పేర్కొన్నారు. స్మృతి మంధానతో విడిపోవడానికి గల కారణాలను ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ, పలాష్ వైపు ఎటువంటి తప్పు లేదని, ఆయన ఒక ‘పాజిటివ్ పర్సన్’ అని సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా ఆయనను వెనకేసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే డైసీ కామెంట్స్ వెనకాల గల కారణం పలాష్ ను కాపాడటమేనా లేక వీరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ బంధం ముగియడానికి కారణం వ్యక్తిగత విభేదాలే అని కొందరు అంటుంటే.. పలాష్ వెనకాల ఎదో స్టోరీ నడిపించాడని వచ్చిన వార్తలే ప్రధాన కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కాగా ఈ బంధం నుంచి బయట పడి స్మృతి తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి.. ఇటీవల జరిగిన WPL 2026 సీజన్ లో బెంగుళూరు జట్టుకు నాయకత్వం వహించడమే కాకుండా కప్పు కుడా సాధించి పెట్టింది. ఇక పలాష్ ముచ్చల్ కూడా సంగీత రంగంలో తనదైన ముద్ర వేయాలని మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. వీరి వివాహ రద్దు ప్రకటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఇంకా వీరిపై మీడియాలో చర్చలు మాత్రం ఇప్పడే ఆగేలా కనిపించడం లేదని డైసీ షా వ్యాఖ్యలతో తెలుస్తోంది.
పలాష్‌పై డైసీ షా ప్రశంసలు.. అసలేం జరిగింది?
నెటిజన్స్ అనుమానాలు.. డైసీ కామెంట్స్ వెనుక కథేంటి?
స్మృతి, పలాష్‌ల వివాహ రద్దు వార్త ఇంకా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉంది. డైసీ షా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


