
బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి నటించిన ‘దండోరా’ సినిమా టీజర్ విడుదలైంది. చావు పుట్టుకల మధ్య సంఘర్షణ, రొమాంటిక్ లవ్ ట్రాక్‌తో తెరకెక్కిన ఈ టీజర్ అదిరిపోయే డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.
Key Points
దండోరాలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషించారు.
నవంబర్ 17న విడుదలైన దండోరా టీజర్ అదిరిపోయే డైలాగ్స్‌తో ఆకట్టుకుంది.
పుట్టుక, చావు మధ్య సంఘర్షణ, రొమాంటిక్ ట్రాక్‌తో సినిమా రూపొందింది.
డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న దండోరాకు మురళీకాంత్ దర్శకత్వం.
దండోరా సినిమా నటీనటులు, విడుదల తేదీ
బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా దండోరా. చావు పుట్టుకల మధ్య జరిగే సంఘర్షణతో, రొమాంటిక్ లవ్ ట్రాక్‌తో తెరకెక్కిన దండోరా టీజర్ ఇవాళ (నవంబర్ 17) విడుదలైంది. అదిరిపోయే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్‌తో దండోరా టీజర్ ఆకట్టుకుంటోంది.
బిగ్ బాస్ శివాజీ, హీరో నవదీప్ , నందు, రవికృష్ణ, బిందు మాధవి, మౌనిక రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం దండోరా.
ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న దండోరా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ సోమవారం (నవంబర్ 17) దండోరా మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అదిరిపోయే డైలాగ్స్‌తో ఆద్యంతం దండోరా టీజర్ ఆకట్టుకుంది.
దండోరా టీజర్ హైలైట్స్, అదిరిపోయే డైలాగ్స్
దండోరా టీజర్‌ను గమనిస్తే.. ప్రేమికుడు ప్రేయసితో మాట్లాడుతూ ఆమెను ముద్దు పెట్టుకుంటానని అంటాడు. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్.. పిచ్చిపిచ్చిగా ఉందా’ అంటూ ఆ అమ్మాయి రివర్స్ అయ్యే సీన్ కామెడీగా ఉంటుంది. అలా మొదలైన టీజర్‌లో నెక్ట్స్ రెండు పాత్రలను పరిచయం చేశాడు.
‘హైదరాబాద్ పో..అమెరికా పో.. యాడికైనా బో.. చస్తే ఈడీకే తేవాలే’ అని శివాజీ చెబుతుంటాడు. ‘మేం తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తరని ఎందివయా ఇది’ అని వెటకారంగా నవదీప్ చెప్పే డైలాగ్.. పల్లెటూర్లు కొన్ని సీన్స్ కామెడీ టచ్‌తో సాగేలా ఉన్నాయి.
చావు పుట్టుకల మధ్య సంఘర్షణ: కథాంశం
అలాగే బిందు మాధవి.. వేశ్య పాత్రలో కనిపించింది. ‘ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్లు డబ్బులిస్తున్నారు..నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నానంటూ’ ఆమె శివాజీతో చెప్పిన డైలాగ్ సీన్స్‌తో పాత్రలను పరిచయం చేశారు దర్శకుడు.
‘నాలుగు పుస్తకాలు చదివి.. లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా’ అంటూ శివాజీ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో మరేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని తెలుస్తోంది. పుట్టుక.. చావు మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణ, పరిస్థితులు, భావోద్వేగాలు గురించి చెప్పే కథాంశంతో ‘దండోరా’ రూపొందుతోందని స్పష్టమవుతోంది.
దండోరా టీజర్ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా చావు పుట్టుకల మధ్య మనిషి సంఘర్షణను ఎలా చూపిస్తుందో చూడాలి. డిసెంబర్ 25న సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


