
దంగల్ చిత్రంతో పాపులర్ అయిన ఫాతిమా సనా షేక్, తనపై జరిగిన ఓ అసభ్యకర సంఘటన గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకినట్లు, దాన్ని ఎదుర్కొన్న తీరును ఆమె వివరించింది.
Key Points
దంగల్ నటి ఫాతిమా సనా షేక్ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.
అసభ్యకర ప్రవర్తనకు గురై, ఆమె వ్యక్తిని కొట్టింది.
ప్రతిస్పందనగా ఆమెను కొట్టడంతో ఆమె కింద పడిపోయింది.
ఈ సంఘటన తర్వాత ఆమె చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలిపింది.
ఫాతిమా సనా షేక్ షాకింగ్ వెల్లడి
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) దంగల్ చిత్రంలో నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ క్రేజీ బ్యూటీగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల ఈ అమ్మడు ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi)రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆర్. మాధవన్(R. Madhavan)కు జోడీగా నటించింది. అయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫాతిమా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఒకసారి ఓ వ్యక్తి నన్ను అసభ్యకరంగా తాకాడు. నాకు చాలా కోపం వచ్చింది.
నేను వెంటనే అతన్ని కొట్టాను. దీంతో ఆ వ్యక్తి చాలా గట్టిగా కొట్టడంతో నేను కింద పడిపోయాను. అతను నాతో ఇబ్బందికరంగా వ్యవహరించడం వల్లే నేను కొట్టాను. అతను తప్పు చేసినప్పటికీ క్షమాపణ చెప్పకుండా నన్ను కొట్టడం నన్నెంతో బాధించింది. నేను ఈ సంఘటన తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలో కూడా ఆలోచించుకోవాలని నేను గ్రహించాను. కానీ విచిత్రం చూడండి… మనతో తప్పుగా ప్రవర్తించిన వారి ముందు ఎలా ఉండాలో కూడా మనం ఆలోచించాలి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అసభ్యకర ప్రవర్తన మరియు ప్రతిస్పందన
తర్వాత జాగ్రత్తలు
ఫాతిమా సనా షేక్ తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే విధానం గురించి మనందరికీ ఆలోచింపజేసింది. స్వీయ రక్షణ మరియు జాగ్రత్తలు చాలా ముఖ్యమని ఆమె అనుభవం తెలియజేస్తుంది.


