
📌 Key Points
- ‘డానీ’ ఫస్ట్ లుక్ విడుదల: ఆశీష్ గాంధీ రగ్డ్ లుక్, హీరోయిన్ సిగరెట్ పోజుతో సంచలనం!
- జూన్ 26న ‘డానీ’ విడుదల: యూత్‌ను టార్గెట్ చేస్తూ లవ్ జంగిల్ కాన్సెప్ట్‌తో చిత్రం!
- సోషల్ మీడియాలో ‘డానీ’ ఫస్ట్ లుక్ ట్రెండింగ్: నెటిజన్లు షాక్, బోల్డ్ కంటెంట్‌పై చర్చ!
- రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్ జి గోగణ పిక్చర్స్ నిర్మాణంలో ‘డానీ’ చిత్రం!
టాలీవుడ్‌లో బోల్డ్ కంటెంట్ ట్రెండ్ అవుతోంది. ఆశీష్ గాంధీ హీరోగా వస్తున్న ‘డానీ’ ఫస్ట్ లుక్‌తో ఒక్కసారిగా హీట్ పెంచేశాడు. ఈ సినిమా యూత్‌కు ఒక ట్రీట్‌లా ఉండబోతుందని టాక్.
ఫస్ట్ లుక్‌తో దుమ్మురేపిన ‘డానీ’
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో యూత్‌ను టార్గెట్ చేస్తూ బోల్డ్, వైల్డ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు రావడం ఎక్కువైంది. ఇంటిమేట్ సీన్స్, రొమాన్స్ డోస్ పెరిగిపోతుండటంతో కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటేనే జనం ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే.. ఆశీష్ గాంధీ(Ashish Gandhi) హీరోగా నటిస్తున్న ‘డానీ’ (Welcome to Love Jungle) చిత్రం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్ జి గోగణ (Kalyan G Gogana)పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అత్యంత విభిన్నంగా, రస్టిక్ లుక్‌లో ఉంది. పోస్టర్‌లో హీరో ఆశీష్ గాంధీ పొడవైన జుట్టు, గడ్డం, కండలు తిరిగిన శరీరంతో చాలా రగ్డ్‌గా కనిపిస్తున్నారు.
అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. హీరోయిన్ తన కాళ్లతో సిగరెట్ పట్టుకోవడం, దానిని హీరో తాగుతున్నట్లు ఉన్న విజువల్! ఈ పిక్ చూసిన నెటిజన్లు ఇంత వైల్డ్‌గా ఉందేంటి భయ్యా? అంటూ షాక్ అవుతున్నారు. లవ్ జంగిల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలోకి రానుంది. పోస్టర్‌లోనే ఇంత ‘బోల్డ్’నెస్ ఉందంటే, ఇక సినిమాలో ఇంకెంత వైల్డ్ రొమాన్స్ ఉంటుందో అని అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒకవైపు రా అండ్ రస్టిక్ సినిమాలకు ఆదరణ ఉన్నప్పటికీ, ఇలాంటి అతిగా అనిపించే సీన్స్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని అంతా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలు ఇలాంటి బోల్డ్ పోస్టర్లతోనే వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు ‘డానీ’ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం యూత్‌ను ఆకర్షించడమే లక్ష్యంగా ఇలాంటి ‘వైల్డ్’ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
వైల్డ్ రొమాన్స్‌తో యూత్‌కు గిలిగింతలు
జూన్ 26న థియేటర్లలో ‘డానీ’ రచ్చ
‘డానీ’ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెరిగిపోయాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


