
తాజాగా సోషల్ మీడియాలో రజినీకాంత్ మలేసియాలో అభిమానులతో కలుస్తున్నారని వార్తలు వైరల్‌గా వ్యాపించాయి. ఈ వార్తలపై రజినీకాంత్ టీమ్ స్పందిస్తూ అవి తప్పుడు వార్తలని ప్రకటించింది.
Key Points
రజినీకాంత్ అభిమానులతో మలేసియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అని వార్తలు వైరల్ అయ్యాయి.
మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ పేరుతో ఈ ప్రచారం జరుగుతోంది.
రజినీకాంత్ ప్రతినిధులు ఈ వార్తలను తప్పుడు వార్తలు అని ఖండించారు.
అభిమానులు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని రజినీకాంత్ టీమ్ హెచ్చరించింది.
మలేసియా మీట్ అండ్ గ్రీట్ వార్తలు వైరల్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు . లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది . తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది . ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున , బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ , శృతిహాసన్ కీలక పాత్రలు పోషించారు .
రజినీకాంత్ టీమ్ స్పందన
అయితే తాజాగా తలైవాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది . రజినీకాంత్ తన ఫ్యాన్స్ తో మలేసియాలో మీట్ అవుతున్నారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది . మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ పేరుతో ఈ ప్రచారం జరుగుతోంది . దీనిపై రజినీకాంత్ ప్రతినిధులు స్పందించారు . మలేసియాలో ఫ్యాన్స్ గ్రీట్ అండ్ మీట్ లాంటివీ తాము నిర్వహించడం లేదన్నారు . అలాంటి వాటిని నమ్మి అభిమానులు మోసపోవద్దని రజినీకాంత్ టీమ్ హెచ్చరించింది . ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు . ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు .
అభిమానులకు హెచ్చరిక
రజినీకాంత్ టీమ్ లేఖలో రాస్తూ .. “ప్రియమైన అభిమానుంలదరికీ .. ప్రస్తుతం మాలిక్ స్ట్రీమ్స్ ప్రమోట్ చేస్తున్న ‘మీట్ అండ్ గ్రీట్ తలైవార్’ అనేది పూర్తిగా అనధికారిక ప్రకటన . ఇలాంటి ఫేక్ ప్రకటనలు ఎటువంటి ముందస్తు అనుమతి పొందకుండానే ప్రమోట్ చేస్తున్నారు . ఫేక్ వాటిపట్ల అభిమానులు , ప్రజలు జాగ్రత్తగా ఉండాలి . ఇలాంటి వాటితో అభిమానులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది . తప్పుడు ప్రకటనలు నమ్మి ఎవరు కూడా పాల్గొనవద్దని అభిమానులను , ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాం ‘ అని ప్రకటన విడుదల చేశారు .
రజినీకాంత్ అభిమానులు తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా ఉండాలని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని రజినీకాంత్ టీమ్ విజ్ఞప్తి చేసింది. మోసాలకు గురవకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.


