|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్-త్రివిక్రమ్: శివుని త్రిశూలం, డీఎన్‌ఏ రహస్యం! ఫస్ట్ లుక్ తోనే అంచనాలు ఆకాశానికి!

Published: 29-06-2026, 11:35 AM
ఎన్టీఆర్-త్రివిక్రమ్: శివుని త్రిశూలం, డీఎన్‌ఏ రహస్యం! ఫస్ట్ లుక్ తోనే అంచనాలు ఆకాశానికి!
  • ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై భారీ అంచనాలు పెంచింది.
  • “శివుని త్రిశూలం… డీఎన్‌ఏ రూపం” డిజైన్, పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌లు ఆకట్టుకున్నాయి.
  • త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్, పీరియాడికల్ కథాంశంతో వస్తున్నట్లు హింట్.
  • హారిక & హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. “శివుని త్రిశూలం… డీఎన్‌ఏ రూపం” అనే వినూత్న డిజైన్, పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌లతో ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. త్రివిక్రమ్ ఈసారి మైథలాజికల్ కథాంశాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఫస్ట్ లుక్ సంచలనం: అంచనాలు ఆకాశానికి!

NTR-Trivikram First Look Out: వచ్చేసింది .. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అప్ డేట్ రానే వచ్చేసింది.రూమర్ల సంగతి ఒకే కాని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడో అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసిన తారక్ ఫ్యాన్ ని ఖుషీ చేస్తూ త్రివిక్రమ్ – తారక్ కాంబోలో సినిమాపై సాలిడ్ అప్ డేట్ రివీల్ అయిపొయింది.యస్ …గత ఏడాదిన్నర ఎదురు చూపులకి ఎండ్ కార్డ్ వేస్తూ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గ్రాండ్ గా వదిలింది మూవీ టీమ్.

ముఖ్యంగా ఈ పోస్టర్ పై ఉన్న “The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander.” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో పాటు, శివుని త్రిశూలం రూపంలో డీఎన్‌ఏ ఆకారాన్ని డిజైన్ చేసిన పోస్టర్ అంచనాలని స్కైలెవెల్ లో పెట్టేసింది. ఎవరి ఊహలకి అందకుండా పురాణాలు, ఆధ్యాత్మికత, యుద్ధం, విధి, వారసత్వం అనే పాయింట్స్ ని టచ్ చేసిన తీరు ట్రేడ్ పండితులని షాక్ కి గురిచేస్తుంది. ఇకపోతే గురూజీ సినిమాల్లో కథలకన్నా మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని తెల్సిందే. కాని ఈ పోస్టర్ చూస్తుంటే ఈసారి విజువల్స్‌తోనే కథ చెబుతున్నాడా అన్న డౌట్ రైజ్ అవుతుంది.ఇక “One Spear. One Purpose. One Divine Reckoning” అనే ఇంగ్లీష్ ట్యాగ్‌లైన్ కూడా ప్రతీకారం, ధర్మయుద్ధం, దైవ సంకల్పం వంటి అంశాలను సూచిస్తోంది.

ఇక పోస్టర్‌లో కనిపిస్తున్న యుద్ధభూమి, మండిపడుతున్న అగ్నిజ్వాలలు,చీకటి వెలుగుల్లో కనిపిస్తున్న గుళ్ళు, మధ్యలో ఆకాశాన్ని చీల్చుతూ వచ్చిన త్రిశూలం చూస్తుంటే సినిమా ఏ స్కేల్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ఆ త్రిశూలం పై భాగంపై డీఎన్‌ఏ ఆకారాన్ని చూపించడం చూస్తుంటే హీరో వెనకాల వంశపారం పర్యం లేదా ఏదైనా శతాబ్దాల నాటి రహస్యం వంటివి ఏమైనా త్రివిక్రమ్ ప్లాన్ చేసి ఉంటాడా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.

పోస్టర్ వెనుక దాగున్న రహస్యాలు

మరో వైపు త్రివిక్రమ్ ఇప్పటి దాకా నాకిదే సేఫ్ అంటూ తీసుకుపోయిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్లకి భిన్నంగా తొలిసారి భారీ స్థాయిలో మైథలజికల్ ,పీరియాడికల్ ఫిలిమ్ ని టేకప్ చేస్తున్నాడని పోస్టర్ హింట్ ఇచ్చేస్తుంది.

ఇక సినిమా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే మొదట్లో అందరు అనుకున్నట్టుగానే హారిక & హాసిని క్రియేషన్స్‌ పైనే ఈ సినిమా తెరకెక్కుతుంది,అయితే ఊహించని విధంగా వారితో పాటు ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తుండటం ఇక్కడ విశేషం.ఇక దేవరకి సాలిడ్ మ్యూజిక్ అందించిన అనిరుద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించడం మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మొత్తానికి సినిమా కథ గురించి ఇప్పుడే రివీల్ చేయకపోయినా ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో అప్పుడే రికార్డుల వ్యూస్ తో పరుగులు పెడుతుంది. చూడాలి మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకి తెరతీస్తుందో !

The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander.

త్రివిక్రమ్ కొత్త ప్రయోగం: మైథలాజికల్ జర్నీ

And, once again with TRIVIKRAM. #NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu

— Jr NTR (@tarak9999) June 29, 2026

మొత్తంగా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక సంచలనం సృష్టించింది. త్రివిక్రమ్ మార్క్ కథనంతో పాటు, భారీ విజువల్స్‌తో కూడిన మైథలాజికల్ జర్నీని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.