|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ కు సర్జరీ తప్పదా? అభిమానుల్లో తీవ్ర ఆందోళన!

Published: 30-06-2026, 12:07 AM
పవన్ కళ్యాణ్ కు సర్జరీ తప్పదా? అభిమానుల్లో తీవ్ర ఆందోళన!
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల గాయాలతో ముంబై ఆసుపత్రిలో.
  • వైద్యులు సర్జరీ తప్పనిసరి అని సూచించినట్లు వార్తలు.
  • గతంలో మీటింగ్‌లో భుజాల కండరాల సమస్య గురించి పవన్ ప్రస్తావన.
  • పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల గాయాలకు చికిత్స నిమిత్తం ముంబైలోని కోకిలబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు సర్జరీ అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ కు భుజాల గాయాలు: అసలు కారణం ఏంటి?

Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజాలకు తీవ్రంగా గాయాలు అయిన విషయం అందరికి తెలిసిందే.. గత కొంతకాలంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ భుజాలకు తగిలిన గాయాల చికిత్స కోసం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తుంది. ముంబైలోని కోకిలబెన్ ధీరుభాయ్ అంబాని ఆసుపత్రికి ఆయన వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ వైద్యులు పవన్ కళ్యాణ్ కు సర్జరీ అవసరమని సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్త విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గతంలో మీటింగ్లో తన భుజాల కండరాలకు సంబంధించిన సమస్యల గురించి ప్రస్థావించారు. రెండు భుజాలకి తీవ్రమైన కాయలు తగలెయ్యని దానికోసం వైద్యులు సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన సర్జరీ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయిన తన భుజాలకు సంబంధించిన చికిత్స కోసం ముంబైకి తన భార్యతో కలిసి వెళ్లారు. ముంబైలోని అంబానీ హాస్పిటల్ కు ఆయన వెళ్లారు.. పవన్ కళ్యాణ్ తన భార్యతో వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపించడంతో ఫ్యాన్స్ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.

ముంబైలో చికిత్స, సర్జరీ అవశ్యకత

పవన్ కళ్యాణ్ ను పరీక్షించిన వైద్యులు ఆయన భుజాల్లోని రొటెటర్ కప్ గాయాలు, అలాగే అవి పూర్తిగా చిట్లిపోవడం వల్లే ఆయనకు భుజాల కండరాలకు తీవ్రమైన నొప్పి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు వైద్యులు సలహా వల్ల సర్జరీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు భుజాలకి సర్జరీ తప్పనిసరిని వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమయ్యారు పవన్ కళ్యాణ్. జిల్లాలలో పర్యటనలు ప్రజల సమస్యలపై సమీక్షలు చేస్తూ తీరికలేనుకుండా బిజీగా ఉంటున్నారు. అంతే కాదు గతంలో సైన్ చేసిన సినిమాలు కూడా వెంటనే పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఆరోగ్య వివరాలు గురించి మరి కాసేపట్లో వైద్యులు వెల్లడించే అవకాశం ఉంది.. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ కు ఇలా జరగడంపై ఆయన అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కోలుకొని త్వరగా ఆంధ్రర కి తిరిగి రావాలని కోరుకుంటున్నారు..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి… pic.twitter.com/mBdTVqfS8b

అభిమానుల ఆందోళన, ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్

— JanaSena Party (@JanaSenaParty) June 29, 2026

పవన్ కళ్యాణ్ భుజాల గాయాలకు సర్జరీ అవసరమని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.