
📌 Key Points
- ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ పై దాడి చేశాడని వీడియో వైరల్.
- తప్పుడు అడ్రస్ కారణంగా ఈ ఘటన జరిగిందని డెలివరీ బాయ్ ఆరోపణ.
- క్షమాపణ చెప్పినా హీరో, కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధితుడి వాదన.
- ఈ వివాదంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
చిన్న సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ ప్రస్తుతం ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఓ డెలివరీ బాయ్ పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో ఆయన ఇమేజ్ దెబ్బతింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది?
Raju weds Rambai Hero : ఈమధ్య చిన్న సినిమాలతో బాగా పాపులాటిని తెచ్చుకుంటున్నారు సినిమా హీరోలు.. ఒకే ఒక సినిమాతో స్టార్ హీరో రేంజ్కి వెళ్తారు.. అయితే ఎంత ఫాస్ట్గా క్రేజ్ ని సంపాదించుకుంటారో.. అంతే ఫాస్ట్ గా చిన్న విషయానికి తమ ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నారు.. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి హీరో పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆన్లైన్ డెలివరీ బాయ్ పై ఆయన దాడి చేశారంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలేం జరిగింది? హీరో ఎందుకు డెలివరీ బాయ్ పై దాడి చేశాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం…
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్ ఒక ఫుడ్ డెలివరీ భాయ్ పై భౌతికంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. ఆ వీడియోలో.. రాంగ్ అడ్రస్‌కు పార్సిల్ తీసుకువచ్చాడనే నెపంతో సదరు హీరో, అతని కుటుంబ సభ్యులు డెలివరీ బాయ్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ డెలివరీ బాయ్ వీడియోలో తెలిపాడు. అందులో డెలివరీ బాయ్ పై బూతులు తిట్టినట్లు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. తానేదో పొరపాటున రాంగ్ అడ్రస్‌కు ఆర్డర్ తీసుకువచ్చినందుకు క్షమాపణలు చెప్పినప్పటికీ, నా కుటుంబ సభ్యులు తనపై తీవ్రంగా తిడుతూ దాడి చేశారని, నేను సారీ చెప్పినా కూడా నన్ను కొట్టడానికి ఎలా వస్తారు? ఆవేదన వ్యక్తం చేశారు.. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న సమయంలో సదరు హీరో డెలివరీ బాయ్ వైపు దూసుకురావడం, అతనిని కొట్టడానికి కూడా ప్రయత్నించినట్లు వీడియోలో చూస్తే అర్థమవుతుంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం హీరో మాత్రం వివాదంలో చెప్పుకున్నట్లు తెలుస్తుంది.. ఆ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి..
డెలివరీ బాయ్ ఆవేదన: ఏం జరిగింది?
#RajuWedsRambai Movie hero #AkhilRaj beats a delivery boy. pic.twitter.com/fZEQKbhAA2
సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన
— Milagro Movies (@MilagroMovies) June 29, 2026
డెలివరీ బాయ్ పై హీరో అఖిల్ రాజ్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తప్పుడు అడ్రస్ కారణంగా జరిగిన ఈ వివాదంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హీరో కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


