
📌 Key Points
- దీపను ‘వదిన’ అనడంతో సూరజ్‌పై పెరిగిన ప్రేమ, కార్తీక్‌తో భావోద్వేగ చర్చ.
- సూరజ్‌ను పిన్నీసుతో పొడిచి జ్యోత్స్న ట్రీట్‌మెంట్, పారిజాతం ప్లాన్ అట్టర్ ఫ్లాప్.
- ఆఫీస్‌లో దీపకు ఘనస్వాగతం, జ్యోత్స్న అసిస్టెంట్‌గా మారడం వెనుక తాతగారి శిక్ష.
- సూరజ్ మంచివాడని కార్తీక్ గ్రహింపు, దీప కొత్త మరిది బంధంపై అమితానందం.
కార్తీక దీపం 2 సీరియల్ అభిమానులకు ఇది నిజంగా పండగే! ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు, సంచలన సంఘటనలు మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తాయి. దీప, సూరజ్, జ్యోత్స్నల మధ్య కొత్త బంధాలు, షాకింగ్ ప్లాన్‌లతో కథ రసవత్తరంగా మారింది.
సూరజ్‌ను ‘వదిన’ అని పిలిచిన దీప: కార్తీక్ రియాక్షన్!
Karthika Deepam 2 Serial June 30th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 30వ ఎపిసోడ్‌లో దీపను సూరజ్ వదిన అని పిలుస్తాడు. దాంతో దీప తెగ మురిసిపోతుంది. మరిది ఫ్యామిలీ గురించి తెలుసుకోమ్మని కార్తీక్‌తో చెబుతుంది దీప. స్కూటీపై వెళ్తుంటే సూరజ్‌కు పిన్నీస్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది జ్యోత్స్న.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌ను గెంటేసేందుకు వేసిన పారిజాతం ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అవుతుంది. పారిజాతంతో తను చేసింది, అవుట్ హౌజ్‌కి తాళం కొన్నదే తానని, మూడు తాళాల్లో నా దగ్గర ఒక్కటుంది. సూరజ్ కాల్ చేయడంతో వచ్చి తీశాను. తప్పు పారు. మంచోడిని నాశనం చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని కార్తీక్ అంటాడు.
మనం ఊహించలేనిది ఏదో జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. మరోవైపు సూరజ్ థ్యాంక్స్ చెబుతాడు. జరిగింది చెబుతాడు. సూరజ్‌కు దీప స్వీట్స్ ఇస్తుంది. థ్యాంక్స్ వదినా అని సూరజ్ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఎందుకో వదినా అని పిలవాలనిపించింది. నాకు ఒక బంధం ఉండాలని అని, స్వీట్స్ చాలా బాగుంది వదిన అని సూరజ్ అంటాడు.
జాగ్రత్తగా ఉండమని చెప్పి కార్తీక్, దీప వెళ్లిపోతారు. సూరజ్ వదిన అన్నది తలుచుకుని దీప మురిసిపోతుంది. కొత్త బంధం నా మరిది సూరజ్, నాకు ఒక మరిది దొరికాడు. నీకు తమ్ముడు దొరికాడు అని దీప అంటుంది. ఎక్కువ రోజులు ఉండని బంధంపై ఎక్కువ ప్రేమ పెంచుకోకని, మనం అనుకున్నదానికంటే సూరజ్ డిఫరెంట్‌గా ఉన్నాడని, రేపు వెళ్లిపోతానంటే ఏం చేయలేమని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న షాకింగ్ ప్లాన్: పిన్నీసుతో సూరజ్‌కు ట్రీట్‌మెంట్!
అక్క అని పిలిస్తే తమ్ముడు అయ్యేవాడు వదిన అని పిలిచి మరిది అయిపోయాడు. అతనికోసం ఏదైనా చేయాలని దీప అంటుంది. ఎందుకు చేయలేం అని శౌర్య లేస్తుంది. ఇద్దరిని పడుకోమంటుంది. ఇద్దరు పడుకుంటారు. సూరజ్ గురించి తెలుసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం జ్యోత్స్నకు మేనేజర్ కాల్ చేసి అర్జంట్‌గా ఆఫీస్‌కు రావాలని, ఛైర్మన్ ఆర్డర్ అని అతను చెబుతాడు.
దాని గురించి జ్యోత్స్న మండిపడుతుంది. పారిజాతం కూడా ఆఫీస్‌కు వస్తానని అంటే కారు ఏది లేదని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కార్తీక్ స్కూటీపై వచ్చిన సూరజ్ హారన్ కొడతాడు. దానికి ఇద్దరు షాక్ అవుతారు. పది నిమిషాల్లో ఉండాలని కాల్ వచ్చిందిగా. 2 నిమిషాలు అయిపోయాయి. స్కూటీ ఎక్కితే తీసుకెళ్తా లేకుంటే లేదని సూరజ్ అంటాడు.
మరోవైపు దీపకు ఆఫీస్‌లో అంతా చప్పట్లతో వెల్‌కమ్ చెబుతారు. జీవితంలో దీప మొహం చూడను అన్న శివ నారాయణే కంగ్రాట్స్ చెబుతాడు. దీప అందరికి స్వీట్స్ ఇస్తుంది దీప. దశరథ్ గురించి అడిగితే.. ముఖ్యమైన పని మీద బెంగళూరు వెళ్లాడని తాత చెబుతాడు. దీపను క్యాబిన్‌లోకి తీసుకెళ్లి సీఈఓ చైర్‌లో కూర్చొబెడతాడు శివ నారాయణ.
దీప అసిస్టెంట్‌గా జ్యోత్స్న: తాతగారి ఊహించని శిక్ష!
ఇకనుంచి కంపెనీ బాధ్యతలు నీవే అని చెప్పి అందరితోపాటు వెళ్లిపోతాడు శివ నారాయణ. కార్తీక్‌కు స్వీట్ తినిపించి ఆశీర్వదించమని కాళ్లమీద పడుతుంది దీప. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని కార్తీక్‌ను హగ్ చేసుకుంటుంది దీప. ఇదంతా నువ్వు ఇచ్చిందే అని ఎమోషనల్ అవుతుంది. సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకున్న ఈ దీప ఈ సంస్థకు అధినేత అయింది. ఇదంతా నీవల్లే అని దీప అంటుంది.
నీ బిడ్డ సుమిత్ర మనవరాలిగానో, మనవడిగానో పుట్టాలి. ఏదో ఒక రోజు నేను నీ మనవరాలిని కాదని తాతతో జ్యోత్స్న చెప్పే రోజు వస్తుంది. చేసిన తప్పు ఒప్పుకుని అందరి కాళ్లు పారిజాతం పట్టుకునే టైమ్ వస్తుంది. సరే.. ఇదంతా వదిలేయి. అమ్మ ఇచ్చిన చీరలో చాలా బాగున్నావని కార్తీక్ అంటాడు. ఆ మాటలన్నింటిని జ్యోత్స్న వింటుంది.
ఇంకో దోషికి ఏ శిక్ష పడుతుందో చూద్దాం పదా అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యో వెళ్లిపోతుంది. శివ నారాయణ ఓ పేపర్ ఇచ్చి ఇందులో అన్ని రాశాను. నువ్వు జ్యోత్స్నకు అర్థమయ్యేలా చదువు అని అంటాడు. జ్యోత్స్న చేసిన తప్పుకి విధించబడుతున్న శిక్ష. పాయింట్ నెంబర్ 1 ప్రతిరోజు ఆఫీస్‌కు రావాలి అని కార్తీక్ అంటాడు.
కార్తీక దీపం 2 లోని ఈ సంచలన ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచాయి. దీప, సూరజ్‌ల బంధం ఎటు దారితీస్తుంది, జ్యోత్స్న ప్లాన్‌లు ఫలిస్తాయా అనేది చూడాలి. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


