|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు మాటలతో నరకం చూపించిన సుమిత్ర.. నోరుజారిన జ్యోత్స్న.. ఒక్కటైన శ్రీధర్, కాంచన

Published: 30-09-2025, 12:14 AM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు మాటలతో నరకం చూపించిన సుమిత్ర.. నోరుజారిన జ్యోత్స్న.. ఒక్కటైన శ్రీధర్, కాంచన

కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. దీపను మాటలతో సుమిత్ర తీవ్రంగా బాధపెట్టింది. అయినప్పటికీ, కళ్లు తిరిగి పడిన దీపకు భోజనం పెట్టి మానవత్వాన్ని చూపింది. ఇది చూసిన జ్యోత్స్న, తల్లి కూతుళ్లు ఒక్కటైపోతారేమోనని నోరుజారడం హైలైట్.

Key Points

1

సుమిత్ర దీపకు మాటలతో మానసిక నరకం చూపింది.

2

అయినప్పటికీ, దీప స్పృహ తప్పగా సుమిత్ర భోజనం పెట్టింది.

4

కార్తీక్ అత్తలోని మంచితనాన్ని ప్రశంసించాడు.

దీపకు మాటలతో నరకం చూపిన సుమిత్ర

కార్తీక దీపం 2 మంగళవారం ఎపిసోడ్ లో కళ్లు తిరిగి కిందపడిన దీపను లేపి భోజనం తినమని ప్లేటు తీసుకొస్తుంది సుమిత్ర. భోజనం పెట్టేంత మానవత్వం నాకుంది కానీ తినిపించేంత ప్రేమ లేదు అంటుంది. నువ్వు మీ ఇంట్లో పడిపోతే నేను ఇంత కంగారు పడేదాన్ని కాదు. అందరున్నప్పుడు పడిపోయిన నాకు బాధ ఉండేది కాదు. ఇంట్లో ఎవ్వరు లేని టైంలో నీకు ఇలా జరిగింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి పట్టించుకోవద్దు అనుకున్నా.. నాలోని అమ్మతనం ఒప్పుకోదు. నువ్వుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఏమైనా అయితే.. నేనే చేశానని అనుకుంటారని సుమిత్ర.. దీపతో అంటుంది.

ఈ మాట నిజంగా మీ మనుసులో నుంచే వచ్చిందా? అని దీప సుమిత్రను అడుగుతుంది. భోజనం చేస్తూ వినమని ప్లేట్ అందిస్తుంది సుమిత్ర. ఇంతకుముందు దీప వేరు. అప్పుడు దీపకు ఆవేశం, నిజాయతీ ఉండేది. ఇప్పుడు నిజాయతీ స్థానంలో స్వార్థం పెరిగిపోయింది అంటుంది. ఆ మాటలు వింటూ ఏడుస్తూనే దీప భోజనం చేస్తుంది.

జ్యోత్స్న నోరుజారిన సంఘటన

ఒకప్పుడు నేను అందరితో ప్రేమగా ఉండేదాన్ని. ఇప్పుడు నాలో ప్రేమ మాయం అయింది. నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే. నువ్వు తిండి మానేసినంత మాత్రానా నీ మీద నాకు కోపం పోదు. నా భర్తను కావాలనే షూట్ చేశానని ఒప్పుకుంటేనే అది పోతుంది. కానీ నువ్వు ఒప్పుకోవు. కార్తీక్ ఒప్పుకోనివ్వడు అంటుంది. నేను నా భర్త దూరంగా ఉండడానికి కారణం నువ్వే. నేను తప్పు చేయడానికి కూడా కారణం నువ్వే అంటూ దీపను నానామాటలు అంటుంది సుమిత్ర. ఏడుస్తూ భోజనం చేస్తున్న దీప మీరు నన్ను కొట్టినా ఇంత బాధకలిగేది కాదని బోరుమంటుంది. కత్తి లేకున్నా చేతులతోనే ప్రాణం తీయగలవు నువ్వు అంటుంది సుమిత్ర దీపను. అప్పుడు దీపకు పొలమారితే తలపై తట్టి నీళ్లు తాగిస్తుంది సుమిత్ర. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కార్తీక్, జ్యో, పారు అది చూసి షాక్ అవుతారు.

దీపకు భోజనం పెట్టానని కార్తీక్ తో అంటుంది సుమిత్ర. కళ్లు తిరిగి పడిపోయిన మనిషిని చూసి వదిలేయడం మానవత్వం కాదని భోజనం పెట్టా. ప్రేమ పొంగిపోయి కాదని అంటూ లోపలికి వెళ్తుంది సుమిత్ర. మేం ఇస్తే తినవు. కానీ మీ అమ్మ భోజనం పెడితే మాత్రం తింటావని దీపతో కార్తీక్ అంటాడు. అత్తలోని మంచితనాన్ని ఎవరూ దూరం చేయలేరని అంటాడు. నాతో మా అమ్మ దారుణంగా మాట్లాడిందని చెబుతుంది కార్తీక్ తో దీప.

సుమిత్రలోని అమ్మతనం: కార్తీక్ స్పందన

మరోపక్క నాకు భయం మొదలైంది గ్రానీ. దీప పడిపోయిందని మా మమ్మీ భోజనం పెట్టింది. ఏడుస్తుందని చేరదీస్తే ఎలా? ఆ తల్లి కూతుర్లు ఒక్కటైపోతారు.. అని నోరు జారుతుంది జ్యోత్స్న. మళ్లీ పారిజాతానికి నిజం తెలియదా కదా అని.. ఆ మాటను కవర్ చేస్తుంది. మనమిద్దరం ఒక్కటిగా ఉండాలని పారును కోరుతుంది. నీకు నేనంటే ఏంటో ఇప్పటికైనా అర్థం అయింది అనుకుంటున్నానని అంటుంది పారు. నా మనువడు, కొడుకును నువ్వు చూసుకో నిన్ను నేను చూసుకుంటాను అంటుంది పారు.

మరోవైపు ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని కాంచన ఇంటికి వస్తాడు శ్రీధర్. కాంచనకు డబ్బులు కూడా ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు తెచ్చావు. మేము నిన్ను అడగలేదే అంటుంది కాంచనా. మీరు నా బాధ్యత. నన్ను అర్థం చేసుకో కాంచనా అంటాడు శ్రీధర్. డబ్బులు లేకపోతే ఏ పని జరగదు. నేనిచ్చింది డబ్బు కాదు ధైర్యం. ఇప్పుడు తీసుకొని మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. కానీ ఈ విషయం కార్తీక్ తో చెప్పొద్దు అంటాడు. అంతలో అక్కడికి కార్తీక్, దీప రావడంతో కాంచన డబ్బు దాచేస్తుంది. ఈ సరుకులు ఎవరు తెచ్చారని అడుగుతాడు కార్తీక్ అనసూయను. మీ నాన్న తీసుకొచ్చాడని ఆమె చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో సుమిత్ర, దీపల మధ్య మాటల యుద్ధం, జ్యోత్స్న ఆందోళన తీవ్ర భావోద్వేగాలను రేపాయి. కుటుంబ సంబంధాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.