|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

76 లక్షల మోసం: ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్

Published: 09-07-2025, 5:17 AM
76 లక్షల మోసం: ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్

బాలీవుడ్ నటి ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టిని 76 లక్షల రూపాయల ఆర్థిక మోసం ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఆమె ఆలియా సంతకాన్ని ఫోర్జరీ చేసిందని పోలీసులు తెలిపారు.

Key Points

1

ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టి అరెస్ట్.

2

76 లక్షల రూపాయల ఆర్థిక మోసం ఆరోపణ.

4

బెంగళూరులో అరెస్ట్, ముంబై పోలీసుల విచారణ.

మాజీ అసిస్టెంట్ అరెస్టు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదిక ప్రకాష్ శెట్టిని జుహు పోలీసులు అరెస్ట్ చేశారు. వేదికపై ఆర్ధిక మోసం ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆలియా, ఆమె ప్రొడక్షన్ కంపెనీ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ నుంచి 76 లక్షలకు పైగా డబ్బు దొంగిలించారని ఆరోపణ. వేదికపై ఫిర్యాదు చేసిన దాదాపు ఐదు నెలల తర్వాత బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వేదిక ఆలియాభట్ సంతకాన్ని ఫోర్జరీ కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆలియా నకిలీ సంతకం వాడి, ప్రొడక్షన్ కంపెనీ అకౌంట్ల నుంచి రెండేళ్లలో లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలిసింది. 2023, 2025 మధ్య ఎటర్నల్ సన్‌షైన్, ఆలియా పర్సనల్ అకౌంట్ల నుంచి 76 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణ.

76 లక్షల రూపాయల మోసం

ఆలియా తల్లి, నటి సోనీ రాజ్‌దాన్ ఫిబ్రవరిలో వేదిక ప్రకాష్ శెట్టిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. అప్పటి నుంచి వేదిక ప్రకాశ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ముంబై పోలీసులు బెంగళూరులో వేదికను పట్టుకుని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోడానికి పోలీసులు ఆమె బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆలియా కాని ఆమె టీమ్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

పోలీసుల విచారణ

ఆలియా భట్ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సినిమా ఉంది. ఈ సినిమాలో ఆమె భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. విక్కీ కౌశల్ మరో హీరోగా నటిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో జీ లే జరా సినిమాలో కూడా ఆలియా నటిస్తోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా కూడా నటిస్తున్నారు.

వేదిక ప్రకాష్ శెట్టి అరెస్ట్ తో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణ మరియు బ్యాంకు అకౌంట్ వివరాల తనిఖీతో మరింత సమాచారం వెలుగులోకి రావచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.