|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అధ్యక్ష్యా అంటూ రెచ్చిపోయిన సుమన్‌ శెట్టి.. బిగ్‌ బాస్‌ తెలుగు చరిత్రలో మొదటిసారి ఇద్దరు కెప్టెన్లు

Published: 17-10-2025, 2:44 PM
అధ్యక్ష్యా అంటూ రెచ్చిపోయిన సుమన్‌ శెట్టి.. బిగ్‌ బాస్‌ తెలుగు చరిత్రలో మొదటిసారి ఇద్దరు కెప్టెన్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఆరో వారం ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కెప్టెన్సీ టాస్క్‌లో సుమన్‌ శెట్టి అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచారు. బిగ్‌ బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా సుమన్‌ శెట్టి, గౌరవ్‌ గుప్తా సంయుక్తంగా కెప్టెన్లుగా ఎంపికై, షోకు కొత్త మలుపునిచ్చారు.

Key Points

1

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఆరో వారం ఆసక్తికరంగా, రంజుగా సాగింది.

2

కెప్టెన్సీ టాస్క్‌లో సుమన్‌ శెట్టి తన విశ్వరూపం చూపించి విజేతగా నిలిచారు.

4

కెప్టెన్సీ బ్యాడ్జ్ ధరించాక సుమన్‌ శెట్టి 'అధ్యక్ష్యా' అంటూ ప్రమాణస్వీకారం చేశారు.

బిగ్‌ బాస్‌ ఆరో వారం హైలైట్స్: కొత్త రూల్స్, గొడవలు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఆరో వారం షో గతంతో పోల్చితే కాస్త ఆసక్తికరంగా, ఇంకాస్త రంజుగా సాగింది. పాత కంటెస్టెంట్లకి, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకి మధ్య కొన్ని గొడవలు షోని రక్తికట్టించాయి. ముఖ్యంగా దివ్వెల మాధురీ ఎంట్రీతో కథ మారిపోయింది. ఆమె హౌజ్‌లో డిక్టేటర్‌షిప్‌ని కొనసాగిస్తుంది. కొత్త రూల్స్ క్రియేట్‌ చేస్తోంది. తనే రూలర్‌గా మారుతుంది. ఈ క్రమంలో శుక్రవారం(40వ) ఎపిసోడ్‌ కాస్త డ్రామాతో, ఇంకాస్త ఫన్నీతో, అదే సమయంలో హీటెక్కించేలా సాగింది. కెప్టెన్సీ టాస్క్ లో సుమన్‌శెట్టి తన విశ్వరూపం చూపించారు. టాస్క్ లో రెచ్చిపోయి ఆడాడు. విన్నర్‌గా నిలిచాడు. వాహ్‌ అనిపించాడు.

ప్రతి వారం శుక్రవారం సమయంలో కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్‌ బాస్‌. ఈ వారం కూడా ఇచ్చారు. అయితే ఈ సారి మూడు జంటలు ఇందులో పాల్గొన్నాయి. వారిలో సుమన్‌ శెట్టి-గౌరవ్‌ గుప్తా ఒక జంటగా, దివ్వెల మాధురీ-ఆయేషా మరో జంటగా, రమ్య-శ్రీనివాస సాయి మూడో జంటగా కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నారు. ఇందులో ముగ్గురుని శవపేటికలో పెడతారు. వారిని జంట పెయిర్స్ లాక్‌ని కన్నుక్కొని తీయాల్సి ఉంటుంది. అలా ఎవరైతే మొదట తీసి గంట కొడతారో, వాళ్లే విన్నర్‌. ఇందులో ఆయేషా మొదటగా లాక్‌ కన్నుకొని వెళ్లినా, లాక్‌ తీయలేకపోయింది. ఆ తర్వాత వెళ్లిన గౌరవ్‌ గుప్తా తన పార్టనర్‌ లాక్‌ తీసి గంటకొట్టారు. విన్నర్‌ అయ్యారు. ఆ తర్వాత ఆయేషా లాక్‌ కనుక్కొని వెళ్లింది. కానీ అప్పటికే సుమన్‌ శెట్టి, గౌరవ్‌లు బయటకు వచ్చి గంట కొట్టారు. ఇందులో విన్నర్‌గా నిలిచారు. దీంతో ఎప్పుడూలేని విధంగా బిగ్‌ బాస్‌ తెలుగు చరిత్రలోనే తొలిసారి ఇద్దరిని ఒకేసారి కెప్టెన్‌ చేశారు.

సుమన్‌ శెట్టి విశ్వరూపం: కెప్టెన్సీ టాస్క్ విజేతగా

అయితే ఆ తర్వాత నిఖిల్‌కి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్‌ బాస్‌. అతను గౌరవ్‌తో టాస్క్ లో పాల్గొని విన్నర్‌ అయి కెప్టెన్‌ అయ్యే అవకాశం కల్పించారు. కానీ ఇందులోనూ గౌరవ్‌ విన్నర్‌ అయ్యాడు. దీంతో ఏడో వారంలో సుమన్‌ శెట్టి, గౌరవ్‌ సంయుక్తంగా కెప్టెన్లుగా ఉండబోతున్నారు. ఇలా చేయడం, జరగడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాక.. ప్రమాణస్వీకారం చేశాడు. నీతి నిజాయితీతో ఉంటానని చెప్పాడు. అధ్యక్ష్యా అంటూ రెచ్చిపోయిన సుమన్‌ శెట్టి తన మొదటి సినిమా `జయం`ని గుర్తు చేశారు. కాసేపు రెచ్చిపోయాడు. సుమన్‌ శెట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. దీనికితోడు సుమన్‌ శెట్టి ని పొగుడుతూ ఇమ్మాన్యుయెల్‌ మాట్లాడిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది.

బిగ్‌ బాస్‌ తెలుగులో తొలిసారి ఇద్దరు కెప్టెన్లు

కెప్టెన్‌ అయిన తర్వాత సుమన్‌ శెట్టి, గౌరవ్‌ కలిసి ఆయేషాకి బెడ్‌ ఇచ్చారు. ఆమెని ఖుషీ చేశారు. ఎపిసోడ్‌ మధ్యలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కిచెన్‌ వద్ద ఆంట్లు క్లీన్‌ చేసే విషయంలో ఆయేషా జీనత్‌, రీతూ చౌదరీకి మధ్య గొడవ అయ్యింది. ఇందులో డీమాన్‌ పవన్‌ కూడా ఇన్‌ వాల్వ్ అయ్యారు. కాసేపు బాగా రచ్చ అయ్యింది. ఇంకోవైపు తాను త్వరగా రాలేకపోయాను, లాక్‌ తీయలేకపోయానని ఆయేషా బాగా కన్నీళ్లు పెట్టుకుంది. తాను ముందుగానే వచ్చినా విన్నర్‌ కాలేకపోయానని తెలిపింది. గోల గోల చేసింది.

బిగ్‌ బాస్‌ తెలుగులో ఇద్దరు కెప్టెన్ల నియామకం చారిత్రాత్మక ఘట్టం. సుమన్‌ శెట్టి, గౌరవ్‌ గుప్తా నాయకత్వంలో ఏడో వారం మరింత ఉత్కంఠగా మారనుంది. ఈ మార్పు ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.