|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

I Bomma : ఓరి బాబు.. ఐ బొమ్మ పోయింది అనుకునేలోపే ఇంకో బొమ్మ.. కానీ క్లిక్ చేస్తే..

Published: 19-11-2025, 11:00 PM
I Bomma : ఓరి బాబు.. ఐ బొమ్మ పోయింది అనుకునేలోపే ఇంకో బొమ్మ.. కానీ క్లిక్ చేస్తే..

ఐ బొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో ఆ సైట్ మూతపడింది. అయితే మూడు రోజులకే ‘iBOMMA one’ పేరుతో మరో కొత్త వెబ్‌సైట్ రావడంతో కలకలం రేగింది. ఇది అసలు దేనికి దారి తీస్తుంది? దీని వెనుక ఎవరున్నారు? పోలీసులు ఏమి చెబుతున్నారు?

Key Points

1

ఐ బొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత అసలు సైట్ క్లోజ్ అయ్యింది.

2

మూడు రోజుల్లోనే 'iBOMMA one' పేరుతో మరో డూప్లికేట్ వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది.

4

ఫ్రీగా సినిమాలు చూసే ఆశతో హానికరమైన లింక్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఐ బొమ్మ రవి అరెస్ట్, సైట్ మూతపడటం

I Bomma : సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ అనే వెబ్ సైట్ లో పెట్టి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి. చేసేదే తప్పు పని అయితే దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఇంకేముంది పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసారు. దీంతో ఐ బొమ్మ సైట్ క్లోజ్ చేసాము అని ఆ సైట్ లో ఓ మెసేజ్ కూడా వచ్చింది.(I Bomma)

ఈ సంఘటనతో ఫ్రీగా ఐ బొమ్మలో సినిమాలు చూసేవాళ్ళు బాధపడుతున్నారు. అయితే ఐ బొమ్మ క్లోజ్ అయిన మూడు రోజులకే ఐ బొమ్మ వన్ అనే వెబ్ సైట్ ప్రత్యక్షమైంది. దాంట్లో సినిమాలేమి లేవు. కానీ ‘iBOMMA one’ సైట్ లోకి వెళ్తే అది మరో పైరసీ సైట్ మూవీ రూల్స్ కి వెళ్తుంది. దీంతో మూవీ రూల్స్ వాళ్ళు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఈ ఐ బొమ్మ పేరు వాడుకొని వాళ్లకు ట్రాఫిక్ పెంచుకోడానికి డూప్లికేట్ సైట్ క్రియేట్ చేసారని భావిస్తున్నారు.

కొత్తగా పుట్టుకొచ్చిన ‘iBOMMA one’ వెబ్‌సైట్ ఉద్దేశ్యం

పలువురు రవి టీమ్ ఎవరైనా ఈ ఐ బొమ్మ వన్ సైట్ క్రియేట్ చేసి ఉంటారని, మళ్ళీ ఐ బొమ్మ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఐ బొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ వెబ్ సైట్స్ ఉన్నాయని, అందులో భాగంగానే ఈ సైట్ ని బయటకు తెచ్చారని భావిస్తున్నారు. ఇలాంటి మిగతా సైట్స్ మీద కూడా ఫోకస్ చేసే ప్లాన్స్ లో ఉన్నపోలీసులు.

పైరసీ, బెట్టింగ్ యాప్‌ల పట్ల పోలీసుల హెచ్చరిక

అయితే ఐ బొమ్మ పైరసీ మూవీస్ కేవలం ఒక సైడ్ బిజినెస్ అని, అసలు బిజినెస్ ఇందులోకి వచ్చేవాళ్లు డేటా తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఈ సైట్ లోకి వచ్చేవాళ్లను బెట్టింగ్ సైట్స్ లోకి మళ్లించడం, దాని ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్స్ కూడా బెట్టింగ్ యాప్స్ లేదా, హానికరమైన లింక్స్ తో ఉంటాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రీగా సినిమాలు చూడొచ్చు అని ఏది పడితే అది క్లిక్ చేస్తే అంతే సంగతులు అని అంటున్నారు పోలీసులు.

ఐ బొమ్మ లాంటి పైరసీ సైట్‌ల వల్ల పరిశ్రమకు నష్టం, యూజర్లకు డేటా, బెట్టింగ్ యాప్‌ల ప్రమాదం పొంచి ఉంది. అపరిచితుల లింక్‌లను క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉచితంగా సినిమాలు చూసే ఆశతో మోసపోవద్దని సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.