|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై భారీ అంచనాలు.. ముహూర్తం ఖరారు, అధికారిక ప్రకటన వచ్చేసింది!

Published: 29-06-2026, 2:15 AM
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై భారీ అంచనాలు.. ముహూర్తం ఖరారు, అధికారిక ప్రకటన వచ్చేసింది!
  • ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ప్రకటించబడింది.
  • నాగ వంశీ పోస్ట్‌లతో మైథలాజికల్ ప్రాజెక్ట్‌గా సూచన.
  • హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
  • ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు ప్రకటన విడుదల చేయబడింది.

ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాగ వంశీ హింట్స్‌తో ఇది మైథలాజికల్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఈ ప్రకటనతో అంచనాలు మరింత పెరిగాయి.

నాగ వంశీ హింట్స్‌తో మైథలాజికల్ ప్రాజెక్ట్

NTR – Trivikram:టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో వేగం పెంచారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్.. అటు బాలీవుడ్ లో వార్ 2 చిత్రం చేసి బొక్క బోర్ల పడ్డారు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈయన.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగా.. మరొకవైపు గత కొంతకాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక కొత్త సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

అయితే ఎక్కడా కూడా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ పెడుతూ..” నాకు అత్యంత అభిమానమైన వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ గా కనిపించబోతున్నాడు.” అని చెబుతూ..” కార్తికేయో మహాసేన శ్వరజన్మా షడాననః, పార్వతి నందనః స్కంద సేనానీ రగ్నీ భూర్గుహః “అంటూ ఒక శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఇక అలా ఎన్టీఆర్, త్రివిక్రం కాంబినేషన్లో మైథాలజికల్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసేసారు నాగ వంశీ. పైగా ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే మైథాలజికల్ డ్రామాగా కార్తికేయ స్వామి నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోందని స్పష్టం అవుతోంది. నాగవంశీ అంతటితో ఆగకుండా మరో పోస్ట్ పెడుతూ..”గాడ్ ఆఫ్ వార్ కమింగ్” అంటూ పోస్ట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. దీంతో ఎప్పుడెప్పుడు అధికారిక అనౌన్స్మెంట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూడగా.. నేడు ఆ ఎదురుచూపుకు తెరదించేసింది హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్..

హారిక & హాసిని క్రియేషన్స్ అధికారిక ప్రకటన

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రముఖ బడా నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు ఎన్టీఆర్ కొత్త మూవీ అనౌన్స్ చేయబోతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ కాంబినేషన్లో ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవ సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ చేతులు కలుపుతున్నారని తెలియడంతో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇకపోతే సాధారణంగా ఈ కథతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో తెరపైకి రావాల్సి ఉంది. పైగా అల్లు అర్జున్ కార్తికేయ స్వామి గెటప్లో.. ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు అంటూ ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సడన్గా ఆ స్థానంలోకి ఎన్టీఆర్ వచ్చేసారు. మరి అల్లు అర్జున్ ఎందుకు ఈ సినిమాను మిస్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఆ పాత్ర ఎన్టీఆర్ ను వరించింది. అసలు విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఈ పాత్రలో ఒదిగి పోవడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ తదుపరి చిత్రాలపై అంచనాలు

Stay tuned to @tarak9999 anna at 5:04PM, today.

— Naga Vamsi (@vamsi84) June 29, 2026

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. అధికారిక ప్రకటనతో అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది. ఈ సినిమా విశేషాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.