
కన్నడ సినీ నటుడు దర్శన్‌కు పోలీసుల నుండి షాక్. రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడ కూడా అరెస్ట్ అయ్యింది.
Key Points
కన్నడ హీరో దర్శన్‌ను రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
సుప్రీం కోర్టు దర్శన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది.
పవిత్ర గౌడతో పాటు దర్శన్‌ను కూడా అరెస్ట్ చేశారు.
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ ప్రధాన నిందితులు.
రేణుకాస్వామి హత్య కేసు
కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ కు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్ బెయిల్ సుప్రీం రద్దు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు . దర్శన్‌తో పాటు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం .. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం వక్రబుద్ధితో సమానమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది .
కాగా … బెంగళూరులో జరిగిన రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, అతనితో పాటు ప్రియురాలు , నటి పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు . జూన్ 11, 2024న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడ అభిమానిగా చెప్పుకునే రేణుకస్వామి నటికి అసభ్యకరమైన సందేశాలు పంపాడని.. అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపణలొచ్చాయి .
సుప్రీం కోర్టు తీర్పు
ఈ కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడను కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 8న బెంగళూరులోని ఒక మురుగు కాలువలో రేణుకస్వామి మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఐదు నెలలు జైలులో ఉన్న తర్వాత డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీం బెయిల్ రద్దు చేయడంతో మరోసారి దర్శన్ ను జైలుకు పంపనున్నారు .
దర్శన్ అరెస్ట్
అసలు ఏం జరిగిందంటే? పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్ స్టార్ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్‌ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పుతో దర్శన్‌కు మరోసారి జైలు శిక్ష పడింది. రేణుకాస్వామి హత్య కేసులో అతని పాత్రపై విచారణ కొనసాగుతుంది.


