|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు!

Published: 26-09-2025, 8:46 AM
దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు!

దసరా నవరాత్రుల్లో ఐదవ రోజున విజయవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపద, ఐశ్వర్యాలకు అధిదేవత అయిన మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం ద్వారా భక్తులు విజయం, సంతోషాలను పొందుతారు. ఆమె ప్రాముఖ్యతను ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.

2

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా నిర్వహణ.

4

ఆమె దర్శనం ఐశ్వర్యప్రాప్తి, విజయం ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

విజయవాడలో మహాలక్ష్మీ దేవి దర్శనం

విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి వేకువ జాము నుంచే దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు అమితమైన పరాక్రమంతో …. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.

అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా… అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి.

పురుషుడికి నిజమైన సంపద ఇల్లాలు

తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అంతరార్థం. పురుషుడు ఎంత ధనవంతుడైనా, భార్య చేదోడు వాదోడుగా నిలవకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది. ఎటువంటి సంతృప్తినీ అది అందించదు. పురుషుడికి నిజమైన సంపద …ఇల్లాలు. ఆమె అందించే సహకారం మాత్రమే.

లోకస్థితికారిణిగా, ధన, ధ్యాన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్మీలుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా… శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహా లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని దర్శించటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే

శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే (1)

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే (2)

మహాలక్ష్మీ ప్రాముఖ్యత, అష్టలక్ష్మీ స్వరూపాలు

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి

సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే (3)

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని

మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే (4)

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి

యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే (5)

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే

మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే (6)

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి

శ్రీ మహాలక్ష్మీదేవి పూజ ఫలితాలు

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే (7)

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే (8)

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్

ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్

మహాలక్ష్మీర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా

శ్రీ మహాలక్ష్మీ దేవి దర్శనం ద్వారా భక్తులు ఐశ్వర్యప్రాప్తి, విజయం పొందుతారని ప్రగాఢ నమ్మకం. అమ్మవారి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు సిద్ధించాలని కోరుకుందాం. సర్వపాపహరి అయిన ఈ దేవిని సేవించడం ద్వారా భక్తులు ముక్తిని పొందుతారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.