
నవరాత్రులు సమీపిస్తున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం, దీపారాధన చేయడం చాలా ముఖ్యం. ఈ కథనంలో నవరాత్రుల్లో దీపం వెలిగించడానికి ఉత్తమమైన నాలుగు ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
Key Points
నవరాత్రుల్లో పూజ గదిలో అఖండ దీపం వెలిగించండి.
తులసి మొక్క ముందు దీపారాధన చేయండి.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించండి.
రావి చెట్టు దగ్గర దీపారాధన చేయండి.
పూజ గదిలో దీపారాధన
మరి కొన్ని రోజుల్లో నవరాత్రులు మొదలవుతాయి. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. తొమ్మిది రోజుల్లో కూడా వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ తొమ్మిది రోజులని కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నవరాత్రుల సమయంలో మంచి ఫలితాలు రావాలంటే దీపారాధన చాలా ముఖ్యమైనది.
ప్రతి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. నవరాత్రుల సమయంలో ఈ ప్రదేశాల్లో దీపారాధన చేయడం విశేష ఫలితాలను తీసుకువస్తుంది. నవరాత్రుల్లో ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. మరి నవరాత్రుల్లో ఎలాంటి దీపాన్ని, ఇంట్లో ఎక్కడ దీపం పెడితే మంచిదో తెలుసుకోండి.
నవరాత్రులలో పూజ గదిలో దీపారాధన చేయండి. తొమ్మిది రోజులు కూడా పూజ గదిలో అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. ఈ దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ అఖండ జ్యోతిని వెలిగించాలనుకోకపోతే, సాయంత్రం ఉదయం రెండు పూటలా కూడా నెయ్యితో లేదా నూనెతో దీపారాధన చేయండి.
తులసి మొక్క ముందు దీపం
నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో కూడా తులసి మొక్క ముందు దీపారాధన చేయండి. అలా దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపదకు లోటు ఉండదు. సంతోషంగా ఉండొచ్చు.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో దేవతలు ప్రవేశిస్తారు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. ఆనందం, శాంతి కలుగుతాయి.
రావి చెట్టు దగ్గర నవరాత్రుల సమయంలో దీపారాధన చేయడం చాలా ప్రయోజనకరం. రావి చెట్టులో త్రిమూర్తులతో పాటు సకల దేవతలు కొలువై ఉంటారు. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే పితృదోషాలు కూడా తొలగిపోతాయి.
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దీపం
దీపం వెలిగించేటప్పుడు నెయ్యితో దీపాన్ని దేవుళ్ల ఫోటోలకు కుడివైపున, నూనె దీపాన్ని ఎడమవైపున పెడితే మంచిది. స్వచ్ఛమైన నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఇలా నవరాత్రుల సమయంలో ఈ విధంగా దీపారాధన చేయడం వలన సానుకూల ఫలితాలను చూడవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
నవరాత్రుల సమయంలో ఈ దీపారాధన పద్ధతులను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, సుఖ సంతోషాలు లభిస్తాయి. అయితే, ఇవి సూచనలు మాత్రమే, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


