
📌 Key Points
- దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది.
- దత్త జయంతి నాడు ఉదయాన్నే నది స్నానం చేసి, షోడశోపచార పూజ చేయాలి.
- దత్త క్షేత్రాలను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయి.
- దత్తాత్రేయుడికి ఇష్టమైన గోవులను, శునకాలను పూజించడం, ఉపవాసం ఉండటం శుభకరం.
ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4న వచ్చింది. దత్త జయంతి రోజు దత్తాత్రేయుని జననం, పౌర్ణమి ప్రాముఖ్యతతో పాటు చేయాల్సిన పూజలు, విధులు, వాటి వల్ల కలిగే శుభ ఫలితాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దత్త జయంతి ప్రాముఖ్యత
Datta Jayanti 2025: ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దత్త జయంతి నాడు ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది.
పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణిమ, శ్రావణ పౌర్ణమికి ఎలా విశిష్టత ఉన్నాయో అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు దత్త జయంతి. అందరికీ గురు దత్తునిగా, దత్తాత్రేయ స్వామిగా తెలిసిన దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది.
ఈ ఏడాది దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 4 అంటే ఈరోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ఇక ఈరోజు దత్తాత్రేయుని జననం గురించి, దత్తాత్రేయుని జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ఉదయాన్నే నది స్నానం చేయాలి. అలా కుదరకపోతే బావి నీరు తీసుకుని స్నానం చేయొచ్చు.
దత్తాత్రేయుని జనన వృత్తాంతం
ఆ తర్వాత షోడశోపచార పూజను చేసి ధ్యానం, జపం వంటివి చేస్తే మంచి జరుగుతుంది.
దత్తాత్రేయుడు యోగమార్గాన్ని అనుసరించాడు. అందుకనే చాలా మంది యోగమార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.
మన ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్త జయంతి నాడు పారాయణం చేస్తారు.
ఈరోజు దత్తక్షేత్రాలను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయి.
దత్త జయంతి నాడు చేయాల్సినవి
దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి గోవులను, శునకాలను పూజిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.
దత్తాత్రేయుడిని ఈరోజు ఆరాధించడం వలన పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుంది.
దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి ఈరోజు భూమిపైకి వస్తాడని నమ్ముతారు. అందుకని గంగా నది ఒడ్డున దత్త పాదుకలను పెట్టి పూజిస్తారు. ఇలా చేస్తే పూర్వజన్మ దోషం నుంచి విముక్తి కలుగుతుంది.
దత్త జయంతి నాడు దత్తాత్రేయుడిని ఆరాధించడం, నిర్దేశించిన పద్ధతులు పాటించడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ పవిత్ర దినాన దత్తాత్రేయుని కృపకు పాత్రులు కండి.


