
📌 Key Points
- జ్యోత్స్నపై దీప మాస్ ఫైర్: తల్లి ప్రేమ గురించి మాస్ వార్నింగ్!
- దశరథ బాధ: సుమిత్ర ఆరోగ్యం, గతాన్ని తలుచుకుంటూ ఆవేదన.
- జ్యోత్స్న షాకింగ్ ప్లాన్: ఓటమిని ఒప్పుకోను అంటూ మరో కుట్రకు సిద్ధం!
- కార్తీక్ రహస్య నిర్ణయం: దీపకు నిజం చెప్పి జ్యోత్స్నను బయటపెడతాడా?
కార్తీక దీపం 2 అభిమానులకు పండగలాంటి అప్డేట్! ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు, సంచలన సన్నివేశాలు మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. దీప, జ్యోత్స్నల మధ్య మాటల యుద్ధం, కార్తీక్ నిర్ణయంతో ఉత్కంఠ పీక్స్‌కి చేరింది.
దీప ఆగ్రహజ్వాలలు: జ్యోత్స్న వెన్నులో వణుకు!
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ లో సుమిత్రను చూస్తూ దశరథ బాధ పడతాడు. ఏమైందని సుమిత్ర ప్రశ్నలు వేస్తుంది. మరోవైపు జ్యోత్స్నపై దీప ఫైర్ అవుతుంది. నిజం చెబుదామని పారు అంటుంది. జ్యోత్స్న స్కామ్ గురించి బయటపెట్టొద్దని శ్రీధర్ కు కార్తీక్ చెప్తాడు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ సుమిత్రను ఇలా చూడటాన్ని తట్టుకోలేకపోతున్నా. తను ఏ తప్పు చేసిందని? తనను అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణమయ్యా. తను వెళ్తే కానీ విలువ తెలియలేదు. ఇప్పుడు తనకే ముప్పు వచ్చింది. ఎలా తట్టుకోవడం? అని దశరథ బాధపడతాడు.
జ్యోత్స్న మరో కుట్ర: పారు సవాల్!
నీలాంటిది కోరుకుంటే నా తల్లి చస్తుందని జ్యో అనగానే దీప కోపంతో ఊగిపోతుంది. తల్లి మీద కన్నప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా. తల్లి బిడ్డను పెంచుతుంది కదా నేను ఆ ప్రేమ గురించి అంటున్నానని దీప సీరియస్ అవుతుంది. జ్యోను లోపలికి లాక్కెళ్తుంది పారు. ఇప్పుడు మనం మూసుకుని కూర్చోవాలి. తిట్టినా, కొట్టినా బుద్ది లేదని పారు అంటుంది.
అప్పుడు నీకదే ఆఖరి రోజు అవుతుంది. నేను కన్నకూతురు కాదు. టెస్టులు చేయిస్తే దొరికిపోతా. నా భయం అమ్మకు వచ్చిన వ్యాధి కంటే పెద్దది అనిపిస్తుంది. ట్రీట్మెంట్ జరిగితే ఇప్పుడే మనం పోతాం. మనం తెగింపుతో నిర్ణయం తీసుకోవాలి. నేనో నిర్ణయం తీసుకున్నా. ఓటమిని ఒప్పుకోనని జ్యో ఏదో ప్లాన్ వేస్తుంది.
కార్తీక్ సంచలన నిర్ణయం: నిజం చెబుతాడా?
జ్యో గురించి ఆలోచించను. పెద్దాయనకు నిజం చెప్తా. నిన్ను డ్రైవర్ ను చేసింది. ఇక ఎలా ఆగుతానని శ్రీధర్ అంటాడు. అత్త వైపు నుంచి ఆలోచించు. కూతురే తల్లిని కాపాడాలని డాక్టర్ చెప్పింది కదా. ఇప్పుడు మనవరాలి గురించి తెలిస్తే తట్టుకుంటాడా? అని కార్తీక్ ఆపుతాడు. అత్తకు బోన్ మ్యారో ఇవ్వాల్సింది జ్యోత్స్న కాదు, దీప. ఇప్పుడు జ్యో అసలు కూతురు కాదనే నిజం బయటపడుతుందని కార్తీక్ అనుకుంటాడు.
దీపను ఇంటి దగ్గర డ్రాప్ చేయ్. ఈ ఫైల్స్ గురించి మన ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియకూడదని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్‌పై మీ అభిప్రాయం ఏమిటి? దీప తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? జ్యోత్స్న కుట్రలు సఫలమవుతాయా? మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి!


