
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పని గంటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకు ఎనిమిది గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుందని ఆమె పేర్కొన్నారు. కొత్తగా తల్లి అయిన మహిళలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దీపికా ‘కింగ్’, ‘AA-22’ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Key Points
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రోజుకు 8 గంటల పని సరిపోతుందని అభిప్రాయపడింది.
తల్లి అయిన తర్వాత మహిళలకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుందని ఆమె నమ్మకం.
కొత్తగా తల్లి అయిన వారికి మద్దతు ఇవ్వాలని దీపికా పిలుపునిచ్చారు.
ప్రస్తుతం 'కింగ్', అల్లు అర్జున్‌తో 'AA-22' వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది.
పని గంటలపై దీపికా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 8 గంటల పని దినాలు కోరుతోంది. తన కూతురు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారింది. పని గంటల కారణం కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించేశారు. అయినప్పటికీ తన డిమాండ్ సరైనదే అన్నట్లు పలు కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, దీపికా పదుకొణె (Deepika Padukone)మరోసారి పని గంటల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా తల్లిపై గౌరవం మరింత పెరిగింది. ఆ బాధలు తెలిశాయి. వర్క్‌ను, పిల్లల బాధ్యతను సరిగ్గా ప్రణాళిక వేసుకోవచ్చని అందరూ అంటారు కానీ అది సాధ్యం కాదు. చెప్పడానికి బాగానే ఉన్నా వాస్తవంలో చాలా కష్టం అవుతుంది.
తల్లిగా ఆమె అనుభవాలు, సవాళ్లు
కొత్తగా తల్లి అయిన వారికి అందరూ మద్దతుగా నిలిస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది. అధికంగా పని చేయడాన్ని కూడా సాధారణం చేసేశాం. అయితే మహిళలకు రోజుకు ఎనిమిది గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుందని నా ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమంగా పని చేయగలం. ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి అవుట్‌పుట్ రాదు. అలాగే తల్లి అయ్యాక 8 గంటల పని చాలు. నేను నా సొంత కార్యాలయంలో కూడా ఆరు రోజుల పని దినాలనే పాటిస్తాం.
దీపికా రాబోయే భారీ ప్రాజెక్ట్స్
అది కూడా రోజులో ఎనిమిది గంటలు మాత్రమే వర్క్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చింది. కాగాజజ ప్రస్తుతం దీపికా పదుకొణె భారీ ప్రాజెక్ట్ ‘కింగ్’ (King)సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ ‘AA-22’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు ప్రాజెక్ట్స్ వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతున్నాయి.
దీపికా పదుకొణె పని గంటలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె దృక్పథం కొత్తగా తల్లులైన మహిళలకు పని-జీవిత సమతుల్యతపై ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఆమె రాబోయే ప్రాజెక్ట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


