|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepika Padukone: మొన్న ‘కల్కి’ నుంచి ఔట్.. ఇప్పుడు దర్శకురాలితో

Published: 30-09-2025, 2:47 AM
Deepika Padukone: మొన్న 'కల్కి' నుంచి ఔట్.. ఇప్పుడు దర్శకురాలితో

బాలీవుడ్ తార దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. కల్కి, స్పిరిట్ చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడం, పనిగంటలపై ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సంఘటనలతో దీపికా హర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె డిమాండ్స్ చుట్టూ చర్చ కొనసాగుతోంది.

Key Points

1

దీపికా పదుకొణె పనిగంటలు, కండిషన్స్‌తో మేకర్స్ హర్ట్ అయినట్లు టాక్.

2

సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' నుంచి దీపికా తొలగింపుపై చర్చ జరిగింది.

4

ఫరా ఖాన్ ఫన్నీ కామెంట్స్‌తో దీపికా హర్ట్ అయ్యి అన్ ఫాలో చేసింది.

దీపికా-సందీప్ రెడ్డి వంగా వివాదం

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో రెండుసార్లు కలిసి పనిచేసిన ఓ దర్శకురాలి మాటలకు హర్ట్ అయింది. ఆమె ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని మరీ సీరియస్‌గా తీసుకున్న దీపిక.. దూరం పెట్టేసింది. సోషల్ మీడియాలోనూ అన్ ఫాలో కొట్టేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా డైరెక్టర్?

కొన్ని రోజులు క్రితం దీపిక పదుకొణెని ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం హీరోయిన్‌గా తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. ఈ మేరకు డిస్కషన్ జరిగింది. అంతా ఓకే అనుకునే టైంలో దీపిక చెప్పిన కండీషన్స్ నచ్చక.. సందీప్ తన మూవీ నుంచి దీపికని పక్కకు తప్పించాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ టైంలో చాలామంది సందీప్ కి సపోర్ట్‌గా నిలిచారు. మరికొందరు దీపికకు సపోర్ట్ చేశారు. మొన్నీమధ్య ప్రభాస్ ‘కల్కి’ టీమ్ కూడా దీపిక తాము తీయబోయే సీక్వెల్‌లో ఉండదని తేల్చి చెప్పారు.

కల్కి నుంచి దీపికా పదుకొణె ఔట్

అయితే దీపిక.. రోజుకు 7 గంటలే పనిచేస్తానని చెప్పిందని, తన టీమ్ దాదాపు 25 మంది కోసం ఫైవ్ స్టార్ హోటల్‌లో రూమ్స్, ఫుడ్ లాంటివి కావాలని అడిగిందని.. అలానే రెమ్యునరేషన్ కూడా తొలి పార్ట్‌కి తీసుకున్న దానికంటే భారీగా డిమాండ్ చేసిందని.. అందుకే ‘కల్కి’ మేకర్స్ దీపికని తప్పించారని మాట్లాడుకున్నారు. తాజాగా ఓ షోలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరా ఖాన్ పాల్గొంది. నటీనటుల వర్కింగ్ అవర్స్(పనిగంటలు) గురించి ఫన్నీగా కామెంట్ చేసింది.

ఫరా ఖాన్ కామెంట్స్: దీపికా హర్ట్?

‘ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు, ఇక ఈ షోకు ఎలా వస్తారా? ఆమెకు అంత టైమ్ ఎక్కడ ఉంటుంది’ అని చెప్పి దీపికని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఫరా ఖాన్ ఫన్నీగా మాట్లాడింది. ఈ మాటలకు దీపిక బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉంది. ఇన్ స్టాలో ఫరా ఖాన్‌ని అన్ ఫాలో చేసింది. దీంతో ఫరా కూడా దీపికని అన్ ఫాలో చేసింది. గతంలో ఫరా తీసిన ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూఇయర్’ సినిమాల్లో దీపికనే హీరోయిన్. కానీ ఇప్పుడు కామెడీగా చేసిన కామెంట్స్ ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్లు కనిపిస్తున్నాయి.

దీపికా పదుకొణె డిమాండ్స్, పనితీరుపై వస్తున్న వార్తలు టాలీవుడ్, బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. దర్శకురాలితో విభేదాలు, పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.