|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepika Padukone: సీక్రెట్స్‌ ఉంటే ఆ హీరోకే చెప్తా.. ముంబైలో మూడు ఇండ్లు..

Published: 29-06-2025, 12:12 AM
Deepika Padukone: సీక్రెట్స్‌ ఉంటే ఆ హీరోకే చెప్తా.. ముంబైలో మూడు ఇండ్లు..

బ్యాడ్మింటన్ ఆటగాడి కుమార్తెగా జన్మించిన దీపికా పదుకొణే, నేడు ప్రముఖ బాలీవుడ్ నటి. అల్లు అర్జున్ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులను మళ్ళీ అలరించబోతోంది. ఆమె సినిమా ప్రయాణం, విజయాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం.

Key Points

1

బ్యాడ్మింటన్ నుండి సినీ ప్రయాణం వరకు దీపికా పదుకొణే విజయగాథ.

2

అల్లు అర్జున్ సినిమాతో మళ్ళీ తెలుగు తెరకు దీపికా.

4

రూ. 500 కోట్లకు పైగా ఆస్తులతో దీపికా సినీ సామ్రాజ్యం.

బ్యాడ్మింటన్ నుండి బాలీవుడ్ వరకు

బ్యాడ్మింటన్‌ కోర్టు వదిలేసి, మోడలింగ్‌ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్‌ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్‌ టాపిక్‌! అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..

బ్యాడ్మింటన్‌ ఆట నుంచి.. దీపికా పదుకొణె ( Deepika Padukone ) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్‌ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్‌ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్‌ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది.

తెలుగులో ఎప్పుడో యాక్ట్‌ చేసింది తెలుగు దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్‌లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అల్లు అర్జున్ సినిమాలో దీపికా

గ్లామర్‌లో తగ్గేదేలే ‘రామ్‌ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌వీర్‌ సింగ్‌తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్‌ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్‌ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్‌ ఖాన్‌తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘పఠాన్‌’, ‘జవాన్‌’లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది.

రూ.500 కోట్లకు పైగా ఆస్తులు హాలీవుడ్‌లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.

రహస్యాన్ని అతడికే చెప్తా ఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్‌ ఖాన్‌ అని బదులిచ్చింది. 2007లో రణ్‌బీర్‌ కపూర్‌తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్‌ ఆర్టిస్ట్‌ కారణంగా ఫోన్‌ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్‌ జరిగింది.

దీపికా యొక్క విజయవంతమైన జీవితం

డిప్రెషన్‌ రణ్‌బీర్‌ కపూర్‌ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్‌కు లోనైనా, కెరీర్‌పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్‌గానే పలకరించుకుంటారు.

దీపికా పదుకొణే సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక కథ. ఆమె విజయం, గ్లామర్, వ్యక్తిగత జీవితం ప్రేక్షకులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.