|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపిక, రణ్‌వీర్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా.. తొలిసారి దువా ముఖాన్ని చూపించిన స్టార్ కపుల్

Published: 22-10-2025, 8:28 AM
దీపిక, రణ్‌వీర్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా.. తొలిసారి దువా ముఖాన్ని చూపించిన స్టార్ కపుల్

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ కూతురు దువా ముఖాన్ని తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో దువా చాలా క్యూట్‌గా కనిపించింది. లక్ష్మీ పూజలో పాల్గొన్న దువా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ కూతురు దువా ముఖాన్ని తొలిసారి రివీల్ చేశారు.

2

దీపావళి సందర్భంగా కుటుంబంతో దిగిన ఫొటోలను దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

4

దువా రెండు జుట్లు వేసుకొని చాలా ముద్దుగా, క్యూట్‌గా కనిపించింది.

దీపికా, రణ్‌వీర్ దంపతుల దీపావళి ప్రత్యేకత

దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జోడీ తొలిసారి తమ కూతురు దువా ముఖాన్ని పబ్లిక్‌గా రివీల్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫొటోలను దీపిక షేర్ చేయగా.. అందులో రెండు జుట్లు వేసుకొని ఆ పాప చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఈసారి దీపావళిని మరింత ప్రత్యేకంగా మార్చారు. తొలిసారిగా తమ కూతురు దువా పదుకోన్ సింగ్ ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎరుపు రంగు దుస్తులలో మెరిసిపోగా, లక్ష్మీ పూజలో దువా పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దువా క్యూట్ లుక్స్: సోషల్ మీడియాలో వైరల్

దువా పదుకోన్ క్యూట్ లుక్స్

దీపికా, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ కలిసి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉమ్మడి పోస్ట్ పెట్టారు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ పోస్ట్‌ను ప్రత్యేకంగా మార్చింది మాత్రం వారి క్యూట్ ఫ్యామిలీ పిక్చర్. వీరు ముగ్గురూ ఎరుపు పేస్టల్ రంగులలో ఒకే రకమైన దుస్తులు ధరించి ఉన్న కారౌసెల్ ఫోటోలను షేర్ చేశారు.

లక్ష్మీ పూజలో పాల్గొన్న దువా

ఈ ఫొటోలలో ఈ పేరెంట్స్ తమ కూతురిని ఆప్యాయంగా చూస్తున్నారు. రెండు చిన్న పిలకలతో దువా ఒక్కో ఫోటోలో ఒక్కోలా క్యూట్ గా అల్లరి చేస్తూ మరింత ముద్దుగా కనిపించింది. ఇక చివరి ఫొటోలో దీపిక ఒడిలో దువా కూర్చుని లక్ష్మీ పూజ చేస్తున్న దృశ్యం ఉంది. దీపికా, తన కూతురి చేతులను పట్టుకుని, దేవతకు నమస్కరిస్తూ ఇచ్చిన పోజు ప్రత్యేకంగా నిలుస్తోంది.

మీడియా కూడా వారి అభ్యర్థనను గౌరవించింది. అయితే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్‌పోర్ట్‌లో ఒక అభిమాని దీపికా, దువా ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. నటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా జరిగింది. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా దువా ముఖాన్ని అఫీషియల్‌గా చూపించడంతో ఫ్యాన్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు.

అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న దువా ఫోటోలు దీపాపావళి సందర్భంగా వెలుగులోకి రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యూట్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.