|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepthi Manne: కాబోయే వాడిని పరిచయం చేసిన ‘ రాధమ్మ కూతురు’

Published: 15-10-2025, 9:30 AM
Deepthi Manne: కాబోయే వాడిని పరిచయం చేసిన ‘ రాధమ్మ కూతురు’

రాధమ్మ కూతురు, జగధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నె తన పెళ్లి కబురు చెప్పి అభిమానులను సంతోషపరిచారు. తన కాబోయే భర్త రోహన్‌ను పరిచయం చేస్తూ, అతనితో దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రత్యేక క్షణాలపై పూర్తి వివరాలు ఇక్కడ.

Key Points

1

నటి దీప్తి మన్నె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.

2

తన కాబోయే భర్త పేరు రోహన్ అని ప్రకటించి, అతని ఫేస్ రివీల్ చేసింది.

4

రాధమ్మ కూతురు, జగధాత్రి సీరియల్స్‌తో దీప్తి మన్నె గుర్తింపు పొందారు.

కాబోయే వాడిని పరిచయం చేసిన దీప్తి

రాధమ్మ కూతరు, జగధాత్రి సీరియల్స్ తో గుర్తింపు పొందిన నటి దీప్తి మన్నె. తన అందం, నటనతో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కాబోయే వాడి ఫేస్ కనిపించకుండా ఫోటోలు పెట్టిన ఆమె, రీసెంట్ గా అతని ఫేస్ రివీల్ చేసింది. తన కాబోయే భర్త పేరు రోహన్ అని ఆమె ప్రకటించారు.

తెలుగు, కన్నడ సీరియల్స్ లో గుర్తింపు పొందిన దీప్తి ప్రస్తుతం జగధాత్రి అనే సీరియల్ లో నటిస్తున్నారు. జీ టీవీ కుటుంబం సాక్షిగా కూడా ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీంతో… జీ టీవీలో పని చేసే ఇతర సీరియల్ నటులంతా కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక స్పెషల్ బహుమతి ఇచ్చి మరీ.. ఆమె వివాహ జీవితం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

రోహన్‌తో దీప్తి మన్నె ప్రేమ సందేశం

తాజాగా దీప్తి తన కాబోయే భర్త రాహుల్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘ ప్రియమైన రోహన్ , నేను ఎదురుచూస్తున్న వ్యక్తివి నువ్వు. ఆ దేవుడు ఇచ్చిన బహుమతి నువ్వు. నన్ను నీ భాగస్వామిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీప్తి మన్నే కన్నడలో పద్మావతి అనే సీరియల్ తో ఎక్కువ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సీరియల్ జగధాత్రిలో నటిస్తున్నారు. ఎక్కువ గుర్తింపు రాధమ్మ కూతురు సీరియల్ తో నే వచ్చింది. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కాబోయే జంట ఫోటో చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

దీప్తి మన్నె కెరీర్, నటనా ప్రస్థానం

దీప్తి… బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి డిగ్రీ పూర్తి చేసింది. నటన మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్‌లో పాల్గొని తమిళ చిత్రం అవాన్‌లో అరంగేట్రం చేసింది. తరువాత ఆమె కన్నడ చిత్రం ‘నమ్మూర్ హైక్లు’, తెలుగు చిత్రం ‘ఇక్ సే లవ్’ , తమిళ చిత్రం ‘దేవదాస్ బ్రదర్స్’లలో నటించింది. ఆ తర్వాత దీప్తి టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించి, మొదట పద్మావతి సీరియల్‌లో నటించి, ఆపై తెలుగులో బిజీగా మారింది.

దీప్తి మన్నె తన కాబోయే భర్త రోహన్‌ను పరిచయం చేయడంతో, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి వివాహ జీవితం ఆనందంగా ఉండాలని ఆశిస్తూ, ఈ నూతన ప్రయాణాన్ని సంతోషంగా ప్రారంభించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.