|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరో హర్షిత్ రెడ్డి ‘దీవాన’ టీజర్ రిలీజ్.. యూత్‌కి పండగే! వైరల్ అవుతున్న డైలాగ్స్!

Published: 12-03-2026, 2:05 PM
హీరో హర్షిత్ రెడ్డి 'దీవాన' టీజర్ రిలీజ్.. యూత్‌కి పండగే! వైరల్ అవుతున్న డైలాగ్స్!
  • హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా ‘దీవాన’ చిత్రం!
  • శ్రీకాంత్ సంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న బ్యూటీఫుల్ లవ్ స్టోరీ!
  • సమ్మర్ స్పెషల్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు చిత్రం సిద్ధం!
  • టీజర్ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న ప్రేమ సాంగ్ బీజీఎం!

యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ‘దీవాన’ సినిమాతో మరోసారి మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. లవ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది.

ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేసిన ‘దీవాన’!

శుభం ఫేమ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. దర్శకుడు శ్రీకాంత్ సంగిరెడ్డి రూపొందిస్తున్న ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. ఓ పెళ్లి వేడుకల్లో హీరోయిన్‌ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో.

అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుంటాడు. ఆ అమ్మాయి తరుపు వాళ్లతో ప్రమాదమని స్నేహితులు చెప్పినా వినిపించుకోడు. ఇంతే ప్రేమ అమ్మాయి నుంచి కూడా ఈ అబ్బాయికి దక్కిందా లేదా అనేది థియేటర్స్ చూడాలి. టీజర్‌లోని ‘ప్రేమ ఇది ప్రేమ గుండెల్లోన సడిరేపేదే ప్రేమ…’ సాంగ్ బీజీఎం హార్ట్ టచింగ్‌గా యూత్‌ను ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక టీజర్ లాస్ట్‌లో ‘ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్ర ఈ పోరీలు.. అది నీ పానం పీక్కతినకపోతే నన్ను అడుగురా..’ అనే డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి.

యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ‘దీవాన’ చిత్రం!

హర్షిత్, స్నేహ జంట మధ్య కెమిస్ట్రీ అదుర్స్!

దీవాన టీజర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హర్షిత్ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.