|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dekh Lenge Saala Song: పవన్ డాన్స్ కి సోషల్ మీడియా షేక్.. చికిరి రికార్డ్స్ అవుట్.. టాప్ లో “దేఖ్ లేంగే సాలా” సాంగ్

Published: 15-12-2025, 2:48 AM
Dekh Lenge Saala Song: పవన్ డాన్స్ కి సోషల్ మీడియా షేక్.. చికిరి రికార్డ్స్ అవుట్.. టాప్ లో “దేఖ్ లేంగే సాలా” సాంగ్
  • “దేఖ్ లేంగే సాలా” సాంగ్ 24 గంటల్లో 29.6 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
  • రామ్ చరణ్ ‘చికిరి’ రికార్డును బద్దలు కొట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ పాట.
  • పవన్ కళ్యాణ్ అదిరిపోయే డాన్స్ స్టెప్స్ ఈ పాట విజయానికి ప్రధాన కారణం.
  • దర్శకుడు హరీష్ శంకర్ ప్లానింగ్ పవన్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది, ప్రశంసలు అందుకున్నాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి విడుదలైన “దేఖ్ లేంగే సాలా” సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ అదిరిపోయే డాన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తోడై రికార్డుల మోత మోగిస్తోంది. 24 గంటల్లోనే 29.6 మిలియన్ల వ్యూస్ సాధించి, చికిరి రికార్డును బద్దలు కొట్టింది. ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది.

రికార్డుల మోత మోగిస్తున్న “దేఖ్ లేంగే సాలా”

Dekh Lenge Saala Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను ఒక రేంజ్ లో సెట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కి భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా “దేఖ్ లేంగే సాలా(Dekh Lenge Saala Song)” అనే పాటను విడుదల చేశారు మేకర్స్.

M.S.Subbulakshmi Biopic: తెరపైకి లెజెండరీ సింగర్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ జీవితం.. శ్రీకారం చుట్టిన గీతా ఆర్ట్స్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా?

పవన్ కళ్యాణ్ డాన్స్ మాయాజాలం!

ఈ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 24 గంటల్లో ఈ రేంజ్ లో వ్యూస్ సాధించిన పాటగా “దేఖ్ లేంగే సాలా” రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకు ముందు ఈ రికార్డ్ రామ్ చరణ్ పెద్ది “చికిరి” పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది “దేఖ్ లేంగే సాలా” సాంగ్. ఇక ఈ పాట ఈ రేంజ్ లో హిట్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ డాన్స్ అనే చెప్పాలి. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్స్ వేశారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు

ఆ క్రెడిట్ మాత్రం దర్శకుడు హరీష్ శంకర్ దే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన నుంచి ప్రస్తుతం ఎలాంటివి కోరుకుంటున్నారు అని పక్కా ప్లాన్ వేసి “దేఖ్ లేంగే సాలా” సాంగ్ ను దించాడు. దాంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఒక్క సింగ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ కి వెళ్లాయి. సినిమా కూడా సాంగ్ లాగానే భారీ విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి సాంగ్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమాతో ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.

పవన్ కళ్యాణ్ “దేఖ్ లేంగే సాలా” పాటతో సృష్టించిన రికార్డులు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పవన్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.