
📌 Key Points
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ విడుదలైంది.
- డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- గబ్బర్ సింగ్, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుండి ‘దేఖ్ లేంగే సాలా’ పాట విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో, దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాట పవన్ కళ్యాణ్ డాన్స్‌తో సందడి చేస్తుంది.
ఉస్తాద్ భగత్ సింగ్: భారీ అంచనాలు
Dekh lenge Saala Song Out Now; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాబోలో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అది కూడా ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘దేఖ్ లేంగే సాలా’ పాట విశేషాలు
Thaman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో
తాజాగా ఈ సినిమా నుంచి దేఖ్ లేంగే సాలా(Dekh lenge Saala Song Out Now) అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందుకోసం రాజమండ్రిలో ప్రత్యేకమైన ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. సాంగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. విశాల్ డడ్లాని పదారు. మోటివేషన్ లా ఉన్న ఈ సాంగ్ ని భాస్కరభట్ల రాశారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా వినేయండి మరి.
మొత్తం మీద, ‘దేఖ్ లేంగే సాలా’ పాట పవన్ కళ్యాణ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ మోటివేషనల్ సాంగ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని ఆశిద్దాం.


