
📌 Key Points
- డీమాంటి కాలనీ 3 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది.
- అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో, అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
- మునుపటి రెండు భాగాలు భారీ విజయం సాధించాయి, మూడో భాగానికి బలమైన నేపథ్యం ఉంది.
- ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
హారర్ ప్రియులను ఉర్రూతలూగించిన డీమాంటి కాలనీ ఫ్రాంచైజీ నుండి మూడవ భాగం ‘డీమాంటి కాలనీ 3’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ పోస్టర్, ఈసారి భయం మరో స్థాయికి చేరుకుంటుందని సంకేతమిచ్చింది. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
డీమాంటి కాలనీ 3: ఫస్ట్ లుక్ అంచనాలు
హారర్ సినిమాల ప్రేమికులకు గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన ‘డీమాంటి కాలనీ’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2015లో విడుదలైన ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కగా.. హీరోగా అరుల్‌నిధి తమిళరసన్ నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా భయానక వాతావరణం, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయానికి కొనసాగింపుగా రూపొందిన ‘డీమాంటి కాలనీ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ పార్ట్‌లో కూడా అరుల్‌నిధి ప్రధాన పాత్రలో కనిపించగా, హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటించారు. కథను మరింత డీప్‌గా తీసుకెళ్లుతూ హారర్, మిస్టరీ, ఎమోషన్‌లను కలిపి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.
ముఖ్యంగా క్లైమాక్స్ ఎండింగ్ మూడో భాగానికి బలమైన హింట్ ఇచ్చింది.ఇప్పటికే ఈ సినిమాకు మూడో పార్ట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌కు మూడో భాగంగా ‘డీమాంటి కాలనీ- 3’ (DemonteColony3)ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ పూర్తిగా డార్క్ టోన్‌లో, మిస్టీరియస్ వాతావరణంతో వెన్నులో వణుకు పుట్టించేలా రూపొందించారు. పోస్టర్ చూస్తే ఈసారి భయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘డీమాంటి కాలనీ – 3’కి కూడా దర్శకత్వం వహించేది అజయ్ జ్ఞానముత్తునే కాగా, హీరోగా మరోసారి అరుల్‌నిధి తమిళరసన్, ప్రియా భవానీ శంకర్ నటించనున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి రానుంది.
మునుపటి విజయాలు, మూడవ భాగానికి ఆధారం
చిత్ర యూనిట్, విడుదల వివరాలు
డీమాంటి కాలనీ 3 ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. మునుపటి భాగాల విజయాల స్ఫూర్తితో, ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను అందుకొని, సమ్మర్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం.


