|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తల్లి కాబోతున్న ‘దేవర’ బ్యూటీ.. హార్ట్ బీట్ రాబోతుందంటూ పోస్ట్

Published: 11-07-2025, 2:43 AM
తల్లి కాబోతున్న ‘దేవర’ బ్యూటీ.. హార్ట్ బీట్ రాబోతుందంటూ పోస్ట్

బుల్లితెర మరియు సిల్వర్ స్క్రీన్ నటి చైత్ర రాయ్ తాజాగా గుడ్ న్యూస్ షేర్ చేసింది. ‘దేవర’ సినిమాతో పాపులర్ అయిన చైత్ర మరో హార్ట్ బీట్ రాబోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Key Points

1

చైత్ర రాయ్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

2

‘దేవర’ సినిమాలో నటించి పాపులారిటీ సంపాదించిన చైత్ర, తన కుటుంబంతో సంతోషకరమైన సమాచారాన్ని పంచుకుంది.

4

చైత్ర రాయ్ ఇప్పటికే ఒక కుమార్తెకు తల్లి.

చైత్ర రాయ్ గురించి

బుల్లితెర నటి చైత్ర రాయ్(Chaitra Rai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు కన్నడ ఇండస్ట్రీకి చెందినప్పటికీ తెలుగులో పలు సిరీయల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ‘అష్టాచమ్మ’(Ashta Chamma)సీరియల్‌లో తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీని తర్వాత మనసున మనసై ఒకరికి ఒకరు, దట్ ఈజ్ మహాలక్ష్మి, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు రాధకు నీవేరా ప్రాణం వంటి ఎన్నో సీరియల్స్ చేసింది. చైత్ర రాయ్ కన్నడలో పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’(devara) మూవీలో కీలక పాత్రలో నటించిన వీపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించగా.. ఆయనకు భార్యగా చైత్ర రాయ్ నటించి మెప్పించింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే చైత్ర ప్రముఖ ఇంజనీర్ ప్రసన్న శెట్టి(Prasanna Shetty)ని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఆమె ఓ యూట్యూబ్ చానల్‌ను కూడా నడిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, చైత్ర రాయ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘మా జీవితంలోకి మరో హార్ట్ బీట్ రాబోతోంది. ఇప్పుడు మేము ముగ్గురం. త్వరలోనే నలుగురు కాబోతున్నాము’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ సెలబ్రిటీలు వావ్, సూపర్ అంటూ చైత్రకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

సోషల్ మీడియా పోస్ట్

అభిమానుల స్పందన

చైత్ర రాయ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె సంతోషకరమైన క్షణాలను అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ సంతోషకరమైన వార్తతో చైత్ర రాయ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.