
📌 Key Points
- రవితేజ ‘ధమాకా’ సినిమా 2022లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పెద్ద హిట్ అయింది.
- ఈ సినిమా సీక్వెల్‌కు ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిజిస్టర్ చేసింది.
- దర్శకుడు త్రినాథరావు నక్కిన రచయిత ప్రసన్న కుమార్ తో కలిసి స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు.
- రవితేజ – శ్రీలీల జోడీ మరోసారి ‘డబుల్ ధమాకా’తో సందడి చేయనుంది.
2022లో రవితేజకు భారీ విజయాన్ని అందించిన ‘ధమాకా’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసింది. రవితేజ – శ్రీలీల జోడి మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ధమాకా విజయం, సీక్వెల్ ప్రణాళికలు
Dhamaka : గత కొన్నాళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్న రవితేజకు 2022 లో ధమాకా సినిమా పెద్ద హిట్ ఇచ్చింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చి రవితేజ కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది. రవితేజ – శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.(Dhamaka)
ధమాకా సినిమాకు సాంగ్స్, మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యాయి. భీమ్స్ సిసిరోలియో జనాల్ని తన పాటలతో థియేటర్స్ కి రప్పించాడు. ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం కూడా పాటలే. దానికి తోడు శ్రీలీల, రవితేజ మాస్ డ్యాన్స్, కామెడీ. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారని తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రూమర్స్ వచ్చాయి.
‘డబుల్ ధమాకా’ టైటిల్ రిజిస్ట్రేషన్
తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ధమాకా సీక్వెల్ కు ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించింది అని సమాచారం. త్రినాథరావు నక్కిన ఇటీవల సందీప్ కిషన్ తో మజాకా సినిమా తీయగా అది ఆశించినంత ఫలితం రాలేదు. ప్రస్తుతం త్రినాథ రావు చేతిలో సినిమాలేమి లేవు.
రవితేజ – శ్రీలీల మళ్ళీ సందడి
దీంతో త్రినాథరావు ఈ డబల్ ధమాకా స్క్రిప్ట్ మీదే రచయిత ప్రసన్న కుమార్ తో కలిసి వర్క్ చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే డబుల్ ధమాకా సినిమా అనౌన్స్ చేస్తారని, రవితేజ – శ్రీలీల కలిసి మరోసారి రచ్చ చేస్తారని టాలీవుడ్ టాక్. ఈ సినిమాతో మరో హిట్ కొడతాడని రవితేజ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మొదటి భాగం మాదిరిగానే ‘డబుల్ ధమాకా’ కూడా మంచి విజయం సాధించి, రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


