
ఈ ఏడాది అక్టోబర్ 18న ధన త్రయోదశి రానుంది. ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి, కుబేరుడు, లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అయితే, ధన త్రయోదశి నాడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కొన్ని వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
Key Points
ఈ ఏడాది అక్టోబర్ 18న ధన త్రయోదశి. ధన్వంతరి, కుబేరుడు, లక్ష్మీదేవి పూజ శుభకరం.
ధన త్రయోదశి నాడు ఇతరులకు డబ్బులు, అప్పులు ఇవ్వకూడదు, ఆర్థిక నష్టాలు తప్పవు.
పంచదార, ఉప్పు, ఉల్లి, వెల్లుల్లి వంటివి ఇతరులకు ఇవ్వడం వలన దుష్ప్రభావాలు ఎదురవుతాయి.
పాలు, పెరుగు, నూనె, సూదులు కూడా ఇవ్వకూడని వస్తువుల జాబితాలో ఉన్నాయి, సమస్యలు ఎక్కువవుతాయి.
ధన త్రయోదశి నాడు డబ్బు ఇవ్వకూడదు ఎందుకు?
ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుకుంటాము. ఈ ఏడాది అక్టోబర్ 18న ధన త్రయోదశి వచ్చింది. ఆ రోజు ధన్వంతరి దేవుడిని, కుబేరుడిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సంపదకి లోటు ఉండదు, ఏ విధమైన ఇబ్బందులు కూడా ఉండవు. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది భావిస్తారు, అనుసరిస్తారు. అలాగే చీపురు కట్ట వంటి వాటిని కూడా కొనుగోలు చేస్తారు.
ఏం చేసినా కొన్ని తప్పులు మాత్రం చేయకుండా చూసుకోవాలి. ధన త్రయోదశి సాయంత్రం ఈ వస్తువులను ఎవరికి ఇవ్వడం మంచిది కాదు. వీటిని ఇవ్వడం వలన సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. మరి ధన త్రయోదశి సాయంత్రం ఏ తప్పులు చేయకూడదు? ఎలాంటి తప్పుల వలన ఏ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం.
ధన త్రయోదశి నాడు పొరపాటున కూడా వీటిని ఎవరికి ఇవ్వకండి:
పంచదార, ఉప్పు, ఉల్లిపాయలు ఇవ్వడం మంచిది కాదా?
లక్ష్మీదేవి ని ధనంగా భావించి పూజిస్తాము. ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరుడు అనుగ్రహం ఉండాలంటే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా రోజూ సాయంత్రం పూజ సమయంలో అస్సలు డబ్బును ఎవరికీ ఇవ్వకండి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ధన త్రయోదశి నాడు ఎవరికీ పంచదార ఇవ్వకండి. అప్పుగా పంచదార ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే లక్ష్మీదేవి కి కోపం వస్తుంది. చెరుకుని లక్ష్మీ దేవికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పంచదారను ఎవరికీ ఇవ్వకూడదు.
ధన త్రయోదశి సాయంత్రం ఉప్పుని ఎవరికీ దానంగా ఇవ్వడం మంచిది కాదు. ఎవరికైనా ఉప్పుని ఇవ్వడం వలన నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి.
పాలు, పెరుగు, నూనె, సూదులు ఇవ్వడం వల్ల నష్టాలు
పొరపాటున కూడా ఎవరికీ ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ఇవ్వకూడదు. అలా ఇస్తే రాహువు, కేతువుల వలన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలను కూడా ఎదుర్కోవాలి. జీవితంలో చిన్నపాటి సమస్యలు కూడా రావచ్చు.
5.పాలు, పెరుగు, నూనె, సూదులు వంటివి కూడా ఇవ్వకండి:
ధన త్రయోదశి సాయంత్రం ఎవరికీ పెరుగు, పాలు, నూనె, సూదులు వంటివి ఇవ్వడం మంచిది కాదు. ఇలా చేయడం వలన గ్రహాల స్థానం లో ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలు ఎక్కువవుతాయి.
ధన త్రయోదశి పర్వదినం నాడు పైన పేర్కొన్న వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడటం మంచిది. అలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలను, ఇతర ఇబ్బందులను నివారించవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపదతో వర్థిల్లుతారు.


