
మరి కొన్ని రోజుల్లో ధన త్రయోదశి వస్తుంది. ఈ పండుగ ప్రాముఖ్యతను తెలుసుకోండి. ఆ రోజు బంగారం, వెండి కొనుగోలు ఆచారం వెనుక గల కారణాలను, అలా కుదరని పక్షంలో ఏ ఇతర వస్తువులు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
Key Points
ధన త్రయోదశి నాడు ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతరి ఉద్భవించాడు.
ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
బంగారం, వెండి కొనలేని వారు ఇత్తడి, రాగి పాత్రలు, చీపురు, ఉప్పు కొనుగోలు చేయవచ్చు.
గోమతి చక్రాలను పూజ గదిలో ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపద కలుగుతుంది.
ధన త్రయోదశి ప్రాముఖ్యత, చరిత్ర
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి ముందు ధన త్రయోదశి వస్తుంది. పంచాంగం ప్రకారం కొన్ని తిధులకు ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ధన త్రయోదశి కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతుడు భూమి మీద ఉద్భవించిన రోజు ధన త్రయోదశి . అలాగే చాలా మంది ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎ
ఈ సంవత్సరం ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది?
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఉత్తరాది వారు దీనిని దంతేరస్ గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందాలని చాలా మంది రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ధన త్రయోదశి నాడు వెండి, బంగారం లాంటి లోహపు వస్తువులను కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు.
బంగారం, వెండి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి , కుబేరుల ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు. దీపావళి పండుగ కూడా ఆ రోజు నుంచి మొదలవుతుంది. బంగారం, వెండి కొనలేకపోతే కొత్త వస్తువులు ఏవైనా కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందని, అదృష్టం కూడా ఎక్కువ అవుతుందని విశ్వసిస్తారు.
బంగారం, వెండి కొనుగోలు వెనుక కారణం
ధన త్రయోదశి నాడు తక్కువ ధరకే వచ్చే ఈ వస్తువులను కూడా కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. కచ్చితంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. చాలా మందికి ఎంతో కష్టంతో కూడుకున్నది. అలా కొనలేని వారు ఇత్తడి, రాగి పాత్రలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అదృష్టం కూడా పెరుగుతుంది.
ధన త్రయోదశి నాడు చీపురు కట్ట కొనుగోలు చేస్తే కూడా మంచి ఫలితాలు ఎదురవుతాయి. ఆ రోజున చీపురు కొనుకుని వాడకుండా ఎప్పుడూ దాచిపెట్టాలి. శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. అలా చేస్తే పేదరికం తొలగిపోతుంది.
లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గోమతి చక్రాలను ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. గోమతి చక్రాలను ఇంటి పూజ గదిలో పెట్టి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు కొరత తొలగిపోతుంది. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
కొనలేకపోతే ఏం చేయాలి? ఇతర శుభ వస్తువులు
ధన త్రయోదశి నాడు ఉప్పును కొనుగోలు చేస్తే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆనందం, శ్రేయస్సును ఉప్పు తీసుకువస్తుందని నమ్ముతారు.
ఈ చిన్న పరిహారాన్ని కూడా పాటించవచ్చు:
11 గోమతి చక్రాలను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇంట్లో ఒక చోట ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే పసుపు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. వాటిని ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి.
ధన త్రయోదశి రోజున సంప్రదాయబద్ధంగా బంగారం, వెండి కొనుగోలు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితిని బట్టి ఇతర శుభప్రదమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఆనందం, శ్రేయస్సు పొందవచ్చని నమ్మకం.


