
టీమిండియా మాజీ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌పై ఆయన మాజీ భార్య ధనశ్రీ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. విడాకుల సమయంలో కోర్టులో ఏడ్చినట్లు ఆమె వెల్లడించారు. చాహల్ కోర్టుకు వచ్చిన విధానంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Key Points
యుజ్వేంద్ర చాహల్ పై మాజీ భార్య ధనశ్రీ తీవ్ర విమర్శలు
విడాకుల సమయంలో కోర్టులో ఏడ్చినట్లు ధనశ్రీ వెల్లడి
వాట్సాప్‌లో చెప్పే విషయాన్ని టీ-షర్టుపై రాసి ప్రదర్శించడం సరైనది కాదని ధనశ్రీ అభిప్రాయం
ధనశ్రీ వర్మ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పై అతని మాజీ భార్య ధనశ్రీ వర్మ ఫైర్ అయింది. విడాకుల సమయంలో కోర్టులో ఏడ్చేశానని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ. ముఖ్యంగా విడాకుల రోజు కోర్టుకు చాహల్ వేసుకొచ్చిన టీ షర్ట్ పై మండిపడింది.
యూట్యూబ్‌లో హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో విడాకుల గురించి మాట్లాడింది. చివరి విచారణ సమయంలో కోర్టులో తాను భావోద్వేగానికి గురయ్యానని ధనశ్రీ వెల్లడించింది.
కోర్టులో చాహల్ టీ-షర్ట్ వివాదం
“తీర్పు ఇవ్వబోతున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. మానసికంగా బాగా సిద్ధమైనప్పటికీ నేను చాలా భావోద్వేగానికి లోనయ్యా. అందరి ముందు ఏడ్వడం మొదలుపెట్టా. ఆ సమయంలో నా ఫీలింగ్ ఏంటో కూడా చెప్పలేకపోయా. నేను ఏడుస్తూనే ఉన్నా. అయితే అదంతా జరిగిపోయింది. అతను ( చాహల్ ) ముందు బయటకు వెళ్ళాడు” అని ధనశ్రీ తెలిపింది.
విడాకుల విచారణ లాస్ట్ డే రోజు యుజ్వేంద్ర చాహల్ ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అని రాసి ఉన్న టీ-షర్టు ధరించి వచ్చాడు. దీనిపై స్పందిస్తూ.. ధనశ్రీ తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. తనకు ఏదైనా చెప్పాలనుకుంటే బహిరంగంగా ప్రదర్శించే బదులు వ్యక్తిగతంగా చెప్పి ఉండాల్సిందని ఆమె అన్నారు.
విడాకుల తర్వాత ధనశ్రీ ఆగ్రహం
“ప్రజలు నిన్ను నిందిస్తారని నీకు తెలుసు. ఈ టీ-షర్టు స్టంట్ జరిగిందని నాకు తెలియకముందే దీనికి ప్రజలు నన్ను నిందిస్తారని మాకు తెలుసు. అరే భాయ్, వాట్సాప్ కర్ దేతా. టీ-షర్టు క్యూన్ పెహనా హై? (వాట్సాప్‌లో పంపి ఉండాల్సింది. టీ-షర్టు ఎందుకు వేసుకున్నావు)’’ అని ధనశ్రీ చెప్పింది.
చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్‌లో గురుగ్రామ్‌లో వివాహం చేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాహల్ ధనశ్రీని డ్యాన్స్ పాఠాలు చెప్పమని అడిగినప్పుడు వీరిద్దరూ కలిశారు. వారి పిటిషన్ ప్రకారం వారు జూన్ 2022 నుంచి సెపరేట్ గా ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న పరస్పర అంగీకారంతో విడాకుల కోసం వారు కుటుంబ న్యాయస్థానంలో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చిలో వారికి విడాకులు మంజూరయ్యాయి. విచారణ జరుగుతున్న సమయంలో ధనశ్రీ భరణంగా రూ.60 కోట్లు కోరుతున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ధనశ్రీ కుటుంబం ఆ వాదనలను ఖండించింది.
యుజ్వేంద్ర చాహల్ మరియు ధనశ్రీ వర్మల విడాకుల విషయం ఇంకా చర్చనీయాంశంగా మారింది. ధనశ్రీ చేసిన వ్యాఖ్యలు సినీ వార్తల్లో కలకలం రేపుతున్నాయి.


