
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తన మాజీ భర్త చాహల్‌తో వివాహం, విడాకులపై షాకింగ్ విషయాలు వెల్లడించింది. పెళ్లైన మొదటి ఏడాది రెండో నెలలోనే అతని మోసాన్ని కనిపెట్టానని తెలిపింది. పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేశాననే వార్తలను కూడా ఆమె ఖండించింది. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Key Points
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రస్తుతం రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నారు.
చాహల్ తనను పెళ్లైన మొదటి ఏడాది రెండో నెలలోనే మోసం చేశాడని ధనశ్రీ వెల్లడించింది.
ఆమె వ్యాఖ్యలతో చాహల్-ధనశ్రీ వర్మ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
విడాకుల తర్వాత పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేశారనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
చాహల్ మోసాన్ని మొదటి ఏడాదిలోనే కనిపెట్టిన ధనశ్రీ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుని ఆరు నెలలైనా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న ధనశ్రీ.. తన వివాహం, విడాకులపై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చాహల్ వివాహం తర్వాత ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. చాహల్ తనను మోసం చేశాడని షాకింక్ విషయాన్ని రివీల్ చేసింది. పెళ్లైన మొదటి ఏడాది రెండో నెలలోనే అతని మోసాన్ని కనిపెట్టానని ధనశ్రీ తెలిపింది. దీంతో మరోసారి చాహల్- ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ షోలో తన వివాహ బంధంపై ధనశ్రీ వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. చాహల్‌తో పెళ్లి.. పొరపాటు చేశానని మీకెప్పుడు అనిపించింది? అని మరో కంటెస్టెంట్ కుబ్రా సైత్ అడిగింది. దీనిపై చాహల్ మాజీ భార్య ధనశ్రీ స్పందించింది. పెళ్లైన మొదటి సంవత్సరం.. రెండవ నెలలోనే చాహల్‌ను పట్టుకున్నా అంటూ సమాధానమిచ్చింది. ఈ సమాధానం విన్న కుబ్రా సైత్ షాకింగ్‌రు గురైంది. కాగా.. చాహల్‌తో విడాకుల తర్వాత ధనశ్రీ పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేసిందనే వార్తలొచ్చాయి. ఈ షోలోనే వీటిపై కూడా క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేసింది ధనశ్రీ వర్మ.
వివాహ బంధంపై ధనశ్రీ షాకింగ్ కామెంట్స్
భరణం వార్తలపై ధనశ్రీ వివరణ
ధనశ్రీ వర్మ తన వైవాహిక జీవితం, చాహల్ మోసం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచాయి. భరణం వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేయడంతో, ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


