
కోలీవుడ్ స్టార్ ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ల డేటింగ్ వార్తలు గత కొద్ది కాలంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా, ధనుష్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను మృణాల్ లైక్ చేయడం వారి పెళ్లి వార్తలకు కారణమైంది.
Key Points
ధనుష్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
మృణాల్ ఠాకూర్ ఆ పోస్ట్‌ను లైక్ చేసింది
ధనుష్ ఇప్పటికే వివాహం చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు
ధనుష్-మృణాల్ డేటింగ్ రూమర్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) డేటింగ్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమాలో నటించనప్పటికీ ప్రేమలో పడినట్లు వార్తలు రావడంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే ధనుష్, మృణాల్ పుట్టినరోజు పార్టీకి హాజరు కావడంతో అంతా డేటింగ్ వార్తలు నమ్మడం మొదలెట్టారు. అంతేకాకుండా ధనుష్ సినిమా ఈవెంట్‌కు సైతం మృణాల్ వెల్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు కలిసినప్పుడు మరీ క్లోజ్‌గా కనిపించడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. గత కొద్ది కాలంగా వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయినప్పటికీ వీరిద్దరు స్పందించలేదు. అయినప్పటికీ పుకార్లకు ఆగడం లేదు. వీరు పెట్టే పోస్టులతోనూ చిక్కుల్లో పడుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ధనుష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఓ బీచ్ వద్ద నిల్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేస్తూ ‘‘అనుకోని సంఘటనలు అద్భుతాన్ని సృష్టిస్తాయని’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఈ పోస్ట్‌ను మృణాల్ లైక్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ధనుష్ లాంటి అర్ధం కాని పోస్ట్ పెట్టాడని అంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో కలకలం
అంతేకాకుండా ఆ ఫొటో మృణాల్ తీసిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా, ధనుష్‌కు ఇప్పటికే పెళ్లైన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులుగ కూడా ఉన్నారు. కానీ పెళ్లైన కొద్దేళ్లకే మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఐశ్వర్య రజినీ ఇంట్లో ఉంటుండగా.. ధనుష్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇక 42 ఏళ్ల వయసులో ఆయన రెండో పెళ్లి చేసుకోబోతుండటం గమనార్హం.
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ధనుష్?
A post shared by Dhanush (@dhanushkraja)
ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ల వివాహ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి మౌనం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.


