
ధనుష్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’ సినిమా జీ తెలుగులో ప్రసారం కానుంది. ఓటీటీలో విజయం సాధించిన ఈ రొమాంటిక్ చిత్రం బుల్లితెరపై ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలుసుకుందాం.
Key Points
ధనుష్ నిర్మించిన 'జాబిలమ్మా నీకు అంత కోపమా' టీవీలో ప్రసారం కానుంది.
జీ తెలుగులో ఆగస్టు 10న సాయంత్రం 6 గంటలకు ప్రసారం.
ఓటీటీలో విజయవంతమైన ఈ రొమాంటిక్ డ్రామా బుల్లితెరకు వస్తుంది.
పవీష్ నారాయణ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలు.
జాబిలమ్మా నీకు అంత కోపమా టీవీ ప్రీమియర్ వివరాలు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలిసిందే. హీరోగానే కాకుండా సింగర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా కుబేర సినిమాలో తన నటనతో యావత్ సినీ ఆడియెన్స్‌తో చప్పట్లు కొట్టించుకున్న ధనుష్ కథ, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన సినిమా జాబిలమ్మా నీకు అంత కోపమా.
థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జాబిలమ్మా నీకు అంత కోపమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు భాషలో జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన కొన్ని రోజులు ట్రెండింగ్‌లో కూడా నిలిచింది జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ.
ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా టీవీ ప్రీమియర్ కానుంది. అంటే, బుల్లితెరపై సందడి చేసేందుకు జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ సిద్ధంగా ఉంది. వివిధ టీవీ షోలు, సీరియల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న ఛానెల్ జీ తెలుగు. అలాంటి జీ తెలుగు ఛానెల్‌లో జాబిలమ్మ నీకు అంత కోపమా టీవీ ప్రీమియర్ కానుంది.
సినిమా కథాంశం: ప్రేమ, విరహం, పెళ్లి
జీ తెలుగులో ఈ ఆదివారం (ఆగస్ట్ 10) సాయంత్రం 6 గంటలకు జాబిలమ్మ నీకు అంత కోపమా టెలీకాస్ట్ కానుంది. అంటే, ఈ వీకెండ్‌కు తమ బుల్లితెర ప్రేక్షకులకు వీకెండ్ ట్రీట్ అందించనుంది జీ తెలుగు.
ఇకపోతే ‘నీలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం (NEEK)’కు తెలుగు వెర్షన్ అయిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా కథలోకి వెళితే.. చెఫ్ అవుదామనుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడు ప్రభు (పవీష్ నారాయణ్) బాగా ధనవంతురాలైన తన ఫస్ట్ లవ్ నీలా(అనికా సురేంద్రన్)తో బ్రేకప్ అవుతుంది. దాంతో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోతాడు.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
కానీ, తన స్కూల్ ఫ్రెండ్ ప్రీతీ (ప్రియా ప్రకాష్ వారియర్) పెళ్లి కూతురుగా తనకి సంబంధం వస్తుంది. అయితే తన మాజీ ప్రేయసిని మర్చిపోలేని సమయంలో ఆమె పెళ్లి శుభలేఖ ప్రభుకి అందుతుంది. అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? చివరికి ప్రభు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనే విషయాలు తెలియాలి అంటే జీ తెలుగు వేదికగా ఈ ఆదివారం ప్రసారమయ్యే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చూడాల్సిందే!
రొమాంటిక్ డ్రామాగా ఆకట్టుకున్న జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమాలో పవీష్ నారాయణన్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించగా మాత్యు థామస్, శరత్ కుమార్, రబియా ఖాతూన్, రమ్య రంగనాథన్, శరణ్య పొనవన్నన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
జీ తెలుగులో ప్రసారం కానున్న ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’ సినిమా, ఓటీటీ విజయం తర్వాత బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించే అవకాశం ఉంది. ఈ వారాంతంలో ఈ సినిమా చూడటం మర్చిపోవద్దు.


