
జూలై 11న ఉదయం చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారికి ఈ చంద్రరాశి మార్పు అనేక అనుకూల ఫలితాలను అందిస్తుంది. ప్రేమ, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలలో అభివృద్ధి కనిపిస్తుంది.
Key Points
ధనుస్సు రాశిలోకి చంద్రుని ప్రవేశం కర్కాటక, కన్యా, వృశ్చిక రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.
ప్రేమ జీవితం మధురంగా మారుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది.
ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు, వ్యాపారులకు లాభాలు కలుగుతాయి.
కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
కర్కాటక రాశి వారికి శుభవార్త
జూలై 11 ఉదయం అంటే ఈరోజు ధనస్సు రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. వృశ్చిక రాశి మూల నక్షత్రం నుంచి చంద్రుడు ధనస్సు రాశికి ప్రవేశించాడు. జ్యోతిష్యం ప్రకారం, చంద్రుడు మనసు, ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితికి కారకుడు. చంద్రుడి కదలిక భావోద్వేగాలు, జీవిత పరిస్థితులను ప్రభావితం చేస్తుంది.
పూర్వాషాడ నక్షత్రానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అందం, ప్రేమ, సామరస్యానికి చిహ్నం. అయితే, చంద్రుని రాశి మార్పు పలు రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. 12 రాశుల వారిపై చంద్రుని రాశి మార్పు ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది . ఈ సమయంలో ఈ రాశి వారి మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు పొందుతారు. సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.
కన్యా రాశి వారి భవిష్యత్తు
కర్కాటక రాశి వారికి ధనస్సు రాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది, ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
కన్యా రాశి వారికి చంద్రుని రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు ఈ రోజు కలిసి వస్తుంది. ఎప్పటినుంచో మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రశంసలు వస్తాయి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అహంకారాన్ని పక్కన పెట్టి, సహనంతో ఉంటే జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండొచ్చు. చిన్నచిన్న అపార్థాలు తొలగిపోయి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు
వృశ్చిక రాశి వారు చంద్రుని రాశి మార్పుతో ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇంటర్వ్యూ, మీటింగ్ లేదా ప్రజెంటేషన్లకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈరోజు కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శుభం.


