|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhee Raju : రాజు బ్రేకప్ స్టోరీ.. ఆమె ఇప్పుడు వేరే అబ్బాయితో.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను.. కాళ్ళు పట్టుకొని..

Published: 08-11-2025, 10:11 PM
Dhee Raju : రాజు బ్రేకప్ స్టోరీ.. ఆమె ఇప్పుడు వేరే అబ్బాయితో.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను.. కాళ్ళు పట్టుకొని..

ఢీ షో ద్వారా ప్రసిద్ధి చెందిన డ్యాన్సర్ రాజు, తన జీవితంలోని బాధాకరమైన బ్రేకప్ స్టోరీని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రేమ విఫలమయ్యాక పడిన వేదన, సూసైడ్ ఆలోచనలు, అలాగే తన ప్రస్తుత మానసిక స్థితిని ఎంతో భావోద్వేగంగా వెల్లడించారు.

Key Points

1

ఢీ రాజు తన రెండేళ్ల క్రితం జరిగిన బ్రేకప్ స్టోరీని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

2

ప్రేమ విఫలం అయ్యాక సూసైడ్ చేసుకుందామనే ఆలోచనలు వచ్చాయని రాజు ఎమోషనల్‌గా తెలిపాడు.

4

ప్రస్తుతం రాజు కెరీర్‌పైనే దృష్టి సారించి, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు.

డ్యాన్సర్ రాజు కెరీర్, బ్రేకప్ నేపథ్యం

Dhee Raju : ఢీ షోలో టైటిల్ గెలిచి ఫేమ్ తెచ్చుకున్నాడు రాజు. ఇప్పుడు డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, పలు టీవీ షోలు, సాంగ్స్ తో బిజీగానే ఉన్నాడు రాజు. డ్యాన్సర్ గా మంచి పేరే తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు తన బ్రేకప్ స్టోరీ చెప్పుకొచ్చాడు.(Dhee Raju)

రాజు తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. ఒక రెండేళ్ల క్రితం బ్రేకప్ అయింది. అప్పుడు ఇద్దరిది అన్ మెచ్యూర్ మైండ్. ఇద్దరికీ మెచ్యూరిటీ లెవల్స్ లేవు. ఒకర్నొకరు అర్ధం చేసుకోలేక విడిపోయాం. ఇప్పటికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని అప్పుడప్పుడు తెలుసుకుంటాను. ఇంకొంత కాలం నేను అయినా వెయిట్ చేసి ఉంటే బాగుండేది. పెళ్లి చేసుకునేవాళ్లం ఏమో. నేను గొడవలు పడకుండా ఉంటే కలిసి ఉండేవాళ్ళం ఏమో.

ప్రేమ విఫలం: రాజు ఆవేదన, సూసైడ్ ఆలోచనలు

Also See : Pawan Kalyan : అడవుల్లో పవన్ కళ్యాణ్.. వాగు వంక చెట్టు పుట్ట పరిశీలించి.. రెండు కిలోమీటర్లు నడిచి.. ఫోటోలు వైరల్..

ఫోన్ చేసి సారీ చెప్పాను. తను లేకపోతే నేను బతకలేను అనేంత దూరం వెళ్ళాను. తను వెళ్ళిపోయాక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. తను పక్కన లేకపోతే ఊపిరి ఆడదు అనేలా ఉండేది. నాకే కాదు అబ్బాయిల అందరికి ప్రేమించిన అమ్మాయి దూరం అయితే అలాగే ఉంటుంది. నేను తనను బాధపెట్టాను. తన కాళ్ళు పట్టుకొని అయినా ఒప్పించాలి అనిపించింది. కానీ తనకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాజు.

ప్రస్తుతం రాజు ఫోకస్ దేనిపై?

అలాగే.. ప్రస్తుతం ఎవర్ని లవ్ చెయ్యట్లేదు. నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. ఫ్యూచర్ లో పెళ్లి మాత్రం చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.

మాజీ ప్రేయసి గురించి రాజు సంచలన వ్యాఖ్యలు

రాజు తన గత ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినా, ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని, తన జీవితంలో ముందుకు సాగుతానని నమ్మకంగా తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.