|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధురంధర్’ దేశభక్తి కాదు, విషప్రచారమే: ధృవ్ రాఠీ సంచలన ఆరోపణలు!

Published: 20-12-2025, 11:44 PM
ధురంధర్' దేశభక్తి కాదు, విషప్రచారమే: ధృవ్ రాఠీ సంచలన ఆరోపణలు!
  • యూట్యూబర్ ధృవ్ రాఠీ ‘ధురంధర్’ చిత్రాన్ని తప్పుడు ప్రచారం (ప్రాపగాండా) గా అభివర్ణించారు.
  • సినిమా వాస్తవాలు, కల్పనలను మిళితం చేసి ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తోందని ధృవ్ ఆరోపించారు.
  • రెహమాన్ డకైత్ వంటి నేరస్తులను గ్లోరిఫై చేయడం, హింసను సాధారణీకరించడంపై ధృవ్ రాఠీ అభ్యంతరం తెలిపారు.
  • నిజమైన దేశభక్తికి ‘సామ్ బహదూర్’, ‘బార్డర్’, ‘స్వదేశ్’ వంటి చిత్రాలను చూడాలని సూచించారు.

ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ ‘ధురంధర్’ సినిమాపై సంచలన వీడియో విడుదల చేశారు. ఈ సినిమా దేశభక్తి పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని, హింసను, నేరస్తులను గ్లోరిఫై చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ధృవ్ రాఠీ ఆగ్రహం: ‘ధురంధర్’ తప్పుడు ప్రచారం

ప్రముఖ యూట్యుబర్​ ధృవ్ రాఠీ ధురంధర్​ సినిమాపై వీడియో చేశారు. ఈ వీడియోలో సినిమాని, సినిమాలో చూపించిన హింసను, రెహమాన్​ డకైత్​ పాత్రను చూపించిన విధానాన్ని, దర్శకుడు ఆదిత్య ధార్​ పొలిటికల్​ వ్యూస్​ని తీవ్రస్థాయిలో విమర్శించారు.

బాక్సాఫీస్​ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్న ధురంధర్​ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రముఖ యూట్యూబర్​, పొలిటికల్​ కామెంటేటర్​ ధృవ్​​ రాఠీ! ఇది ఒక తప్పుడు ‘ప్రాపగాండా’ అని, వాస్తవాలు- కల్పితాలను మిళితం చేసి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా సినిమాను తీశారని మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్​ ఛానెల్​లో తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

“ఏది వాస్తవం? ఏది కల్పితం? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇది ప్రేక్షకులకు తెలియదు. వారు చెప్పలేరు. సినిమాలో లీనమైపోయిన వారికి అసలు ఈ ప్రశ్నే రాదు. దానినే గుడ్డిగా నమ్ముతారు. అదే నిజం అని భావిస్తారు. వాస్తవ సంఘటనలకు డ్రామా స్టోరీ టెల్లింగ్​ని జోడించి చూపిస్తే, చరిత్రపై ప్రజల్లో ద్వంద్వ అభిప్రాయాలు కనిపిస్తాయి,” అని ధృవ్ రాఠీ అన్నారు.

ధురంధర్​ సినిమాలోని హింస, నేర స్వభావం కలిగిన పాత్రలను హైలైట్​ చేయడాన్ని కూడా ధృవ్ రాఠీ తప్పుపట్టారు.

“ఈ సినిమా హింస, గ్యాంగ్​స్టర్స్​ని గ్లోరిఫై చేస్తుంది. డ్రగ్స్​, కిడ్నాప్​, ఎక్స్​టార్షన్​, మర్డర్లలో రెహమాన్​ డకైత్ ​ ఒక కరుడుగట్టిన నేరస్తుడు. సొంత తల్లినే చంపేశాడు. కానీ సినిమాలో ఆయన్ని ‘కూల్​ స్వాగ్​’తో, స్టైలిష్​ లుక్స్​తో, వైరల్​ డ్యాన్స్​తో చూపించారు. ఇలాంటి ఉగ్రవాదులను ఈ విధంగా చూపించడం సరైన పద్ధతేనా?” అని యూట్యూబర్​ ప్రశ్నించారు.

సినిమాలో హింస, నేరస్తుల చిత్రీకరణపై విమర్శలు

సినిమాలో హింసను నార్మలైజ్​ చేయడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ధృవ్​ రాఠీ ఈ వీడియో విడుదల చేశారు.

“గ్యాంగ్స్​ ఆఫ్​ వస్సెపూర్​ సినిమాని తీసుకెళ్లి పాకిస్థాన్​లో పెట్టారు. యానిమల్ ​ రేంజ్​లో హింసను జోడించారు. పొలిటికల్​ ప్రాపగాండాను రుద్ది ధురంధర్​ అనే సినిమాని తీశారు,” అని ధ్రువ్​ రాఠీ అభిప్రాయపడ్డారు.

“ఆర్ట్​ అనేది ప్రజల హితం కోరుకునే విధంగా ఉండాలి. కానీ ఆదిత్య ధార్​ వంటి ఫిల్మ్​మేకర్లు దీనికి విరుద్ధం. సొంత దేశాన్ని ఎగతాళి చేస్తారు. మీరు నిజమైన దేశభక్తి సినిమాలు చూడాలని భావిస్తే.. సామ్​ బహదూర్​, బార్డర్​, 1971, సర్ఫరోష్​, నీరజా, స్వదేశ్​, చక్​ దే ఇండియా వంటివి చూడండి,” అని సలహా ఇచ్చారు.

“చివరిగా ఆదిత్య ధార్​కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తప్పుడు ప్రాంపగాండాలతో సినిమాలు చేయడం ఆపకేపోతే.. మీ లెగేసీ కూడా హిట్లర్​ ఫేవరెట్​ ఫిల్మ్​మేకర్​ (లెని రైఫెన్​స్టల్​)లా అయిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. రేపనే రోజున ఎవరైనా భవందర్​ (2000లో వచ్చిన హిందీ సినిమా) లాంటి సినిమా తీస్తే మీ ఇమేజ్​ ఎమవుతుంది? ఆలోచించండి,” అని యూట్యూబర్​ అన్నారు.

సినిమాలోని పొలిటికల్​ వ్యూస్​తో తాను అంగీకరించకపోయినా, ధురంధర్​ స్టోరీటెల్లింగ్​ చాలా బాగుందని బాలీవుడ్​ నటుడు హృతిక్ ​ రోషన్​ ఇటీవలే కామెంట్స్​ చేశారు. ఈ విషయాన్ని కూడా ధృవ్​ రాఠీ ప్రస్థావించారు.

నిజమైన దేశభక్తి చిత్రాలు ఇవేనంటూ ధృవ్ రాఠీ సలహా

“ప్రాపగాండా ఉన్నా కూడా సినిమా బాగుందని హృతిక్​ రోషన్​ అంటున్నారు. కానీ సినిమా ఎంత బాగున్నా.. చివరికి అది ప్రాపగాండానే!” అని ధృవ్​ రాఠీ అన్నారు.

“ధురంధర్​ చూడొద్దని ధృవ్​ రాఠీ చెబుతున్నాడు. అయితే వెళ్లి చూడాల్సిందే,” అని ఒకరు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. “ఏం మాట్లాడుతున్నారు హిట్లర్​పై తీసిన సినిమాలు ఎవరికీ నచ్చలేదు. కానీ మన ధూరంధర్​ సినిమాని అంతర్జాతీయంగా, పాకిస్థాన్ ​లో కూడా పొగుడుతున్నారు,” అని మరొకరు అన్నారు.

“హిందుస్థానీకి అతిపెద్ద శత్రువు హిందుస్థానీయే. పాకిస్థాన్​ రెండో స్థానంలో ఉంటుందని అజిత్​ దోవల్​ అన్నారు,” అని మరొకరు కామెంట్​ చేశారు.

“ఈ లాజిక్​తో సామ్​ బహదూర్​, బర్డర్​ వంటి సినిమాలు కూడా ప్రాపగాండా కిందకే వస్తాయి కదా,” అని ఇంకొకరు అన్నారు.

ఏదైమానా బాక్సాఫీస్​ వద్ద మాత్రం ధురంధర్​ సినిమా దూసుకెళుతోంది. విడుదలైన 16వ రోజు రూ. 33కోట్ల కలెక్షన్స్​ని రాబట్టింది. రూ. 500 కోట్ల క్లబ్​లో చేరింది.

ధురంధర్’ చిత్రంపై ధృవ్ రాఠీ చేసిన వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. సినిమాలోని హింస, వాస్తవాల వక్రీకరణపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ప్రేక్షకుల ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.