|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మురేపిన ‘ధురంధర్ 2’ మూవీ: 3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టి రికార్డులు బ్రేక్!🔥

Published: 22-03-2026, 12:05 AM
దుమ్మురేపిన 'ధురంధర్ 2' మూవీ: 3 రోజుల్లో 500 కోట్లు కొల్లగొట్టి రికార్డులు బ్రేక్!🔥
  • రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మూవీ సంచలనం: 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు!
  • తొలిరోజు రూ.80.72 కోట్లు, రెండో రోజు రూ.126.27 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’ మూవీ రికార్డ్స్
  • భారత్‌లో ‘ధురంధర్ 2’ మూవీ 3 రోజుల్లో రూ. 339.27 కోట్ల నెట్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు
  • ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకుపోతుంది.

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

3 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు: రికార్డులు బ్రేక్!

Dhurandhar 2 Day 3 Worldwide Box Office Collection: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. దాంతో ఆ హీరోల సినిమాల రికార్డ్స్ కనుమరుగు అయిపోయాయి.

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆదిత్య ధర్ , రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. 2025లో ఘనవిజయం సాధించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, కేవలం మూడు రోజుల్లోనే రూ. 300 కోట్లకుపైగా నెట్ వసూళ్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద రద్దీ మరింత పెరిగింది.

భారత్‌లో దుమ్మురేపిన ‘ధురంధర్ 2’ మూవీ కలెక్షన్స్

శుక్రవారం (మార్చి 20) నాడు వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినా రూ. 80.72 కోట్లు రాబట్టి సత్తా చాటింది. అయితే శనివారం (మార్చి 21) నాటికి మళ్లీ పుంజుకుని ఏకంగా రూ. 126.27 కోట్ల వసూళ్లను సాధించింది. దీనితో ఇప్పటివరకు ఈ చిత్రం భారతదేశంలో మొత్తం రూ. 339.27 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్లయింది. అలాగే, శనివారం నాడు థియేటర్లలో 81.6% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.

అలాగే, ధురంధర్ 2 సినిమాకు ఇండియాలో 3 రోజుల్లో రూ. 404.54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సక్నిల్క్ సంస్థ తాజాగా పేర్కొంది. ఓవర్సీస్‌లో రూ. 96.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక వరల్డ్ వైడ్‌గా 3 రోజుల్లో ధురంధర్ 2 సినిమా ఏకంగా రూ. 501.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్‌సైట్ పేర్కొంది.

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇదేనా?

అంటే, 3 రోజుల్లోనే ధురంధర్ 2 మూవీ 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిపోయింది. దీంతోపాటు ఇవాళ (మార్చి 22) ఆదివారంతో కలిపి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘ధురంధర్ 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవుతూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.