
📌 Key Points
- ధురంధర్2 చిత్రం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఆదరణ పొందుతోంది.
- ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
- ఉత్తర అమెరికాలో బాహుబలి 2 రికార్డును ధురంధర్2 బద్దలు కొట్టింది.
- శోభు యార్లగడ్డ ధురంధర్2 సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం ధురంధర్2 సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రం బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాకుండా, బాహుబలి 2 రికార్డులను సైతం బద్దలు కొట్టింది. దీనిపై శోభు యార్లగడ్డ స్పందించారు.
దుమ్మురేపుతున్న ధురంధర్2 కలెక్షన్లు
Dhurandhar 2: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ధురంధర్2 (Dhurandhar 2) హవా కొనసాగుతోంది. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమా ప్రసారమవుతూ విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా జోరు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమా పది రోజులలోనే ఏకంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా విడుదల అయ్యి పది రోజులు అయినప్పటికీ ప్రతి ఒక్క చోట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా బాహుబలి 2 రికార్డు సాధించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి రికార్డులను మాత్రం చెరిపేయలేకపోయాయి. అయితే తాజాగా ఉత్తరా అమెరికాలో ధురంధర్2 సినిమా కేవలం పది రోజులలోనే 20 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఒక నేటిజన్ ధురంధర్2 బాహుబలి 2రికార్డులను బద్దలు కొట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ధురంధర్2 సినిమాను ఎంజాయ్ చేసాను..
బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టిన ధురంధర్2
ఇక ఈ పోస్ట్ చూసినటువంటి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda)నేటిజన్ చేసినటువంటి పోస్ట్ పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. “ఇటీవల తాను కూడా ధురంధర్2 సినిమా చూశానని ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దల కొడుతూ సరికొత్త రికార్డులను సృష్టించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి మంచి సక్సెస్ అందుకున్నందుకు చిత్ర బృందానికి అభినందనలు” అంటూ శోభు యార్లగడ్డ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే దర్శకుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క హీరో కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu
— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026
శోభు యార్లగడ్డ ప్రశంసలు.. వైరల్ అవుతున్న పోస్ట్
ఈ సూపర్ హిట్ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్, సారా అర్జున్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ ఆదిత్యధర్ పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది. ఇలా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో మూడో భాగం కూడా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు అయితే ఈ సినిమా దాదాపు ఉండకపోవచ్చు అని చిత్ర బృందం తెలియచేశారు కానీ అధికారకంగా మాత్రం వెల్లడించలేదు.
మొత్తానికి ధురంధర్2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ శోభు యార్లగడ్డ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


