
📌 Key Points
- ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
- ‘ధురంధర్ 2’ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
- క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌తో పాటు ‘ధురంధర్ 3’ ప్రకటన ఉంటుందట.
- మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానుండగా, అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’ రాబోతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని, అలాగే ‘ధురంధర్ 3’ గురించి ప్రకటన కూడా ఉంటుందని సమాచారం.
‘ధురంధర్’ సంచలన విజయం
Dhurandhar: ధురంధర్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎటువంటి అంచనాలు లేకుండా డిసెంబర్ 5 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొత్తంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు మంచి కథ ఓరియంటెడ్ చిత్రాలు కూడా థియేటర్లు దొరక్క ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి అంటే ఇక ఈ సినిమాకి ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి సినిమాకి కొనసాగింపుగా ధురంధర్ 2 రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది.
ధురంధర్ కి మించి సీక్వెల్ ఉంటుందని అటు చిత్ర బృందం కూడా భారీగా హైప్ పెంచేస్తున్న విషయం తెలిసిందే . ఇక రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 19వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా కచ్చితంగా 2000 కోట్ల క్లబ్లో అది కూడా వారంలోపే చేరడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మరో వార్త అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
‘ధురంధర్ 2’పై అంచనాలు
అసలు విషయంలోకి వెళ్తే.. ధురంధర్ 2 సినిమా క్లైమాక్స్ లో ఎవరు ఊహించని విధంగా భారీ ట్విస్ట్ ప్లాన్ చేశారట డైరెక్టర్ ఆదిత్యధర్ . కేవలం ట్విస్ట్ తోనే సరిపెట్టకుండా.. సినిమా చివర్లో ధురంధర్ 3కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉంటుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకు ఊహించని షాక్ అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ధురంధర్ 3 కూడా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు రెండో భాగం ముగిసిన వెంటనే మూడో భాగం ఎప్పుడు మొదలవుతుంది? దాని కథ ఏంటి? కథను ఎలా మలుపు తిప్పబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొనింది.. ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలి అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇకపోతే మార్చి 19న థియేటర్లలో ఈ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు కూడా అప్పుడే కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా మరొక పక్క ఈ సినిమాకి పోటీగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ..పైగా గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నట్లు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
క్లైమాక్స్‌లో ట్విస్ట్.. ‘ధురంధర్ 3’ ఉంటుందా?
‘ధురంధర్ 2’ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మార్చి 19న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.


