|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2: బాక్సాఫీస్ బద్దలే.. రికార్డుల మోత మోగించేందుకు రెడీ!

Published: 08-03-2026, 12:05 AM
దురంధర్ 2: బాక్సాఫీస్ బద్దలే.. రికార్డుల మోత మోగించేందుకు రెడీ!
  • దురంధర్ 2 ట్రైలర్‌తో సోషల్ మీడియా షేకింగ్: రికార్డ్ వ్యూస్‌తో దుమ్ము రేపుతోంది!
  • విడుదలకు ముందే దురంధర్ 2 సెన్సేషన్: ప్రీమియర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి!
  • బుక్ మై షోలో దురంధర్ 2 విధ్వంసం: కొన్ని క్షణాల్లోనే 90 వేల టికెట్లు బుక్!
  • పాన్ ఇండియా రిలీజ్‌తో దురంధర్ 2: బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల వసూళ్లు ఖాయం!

బాలీవుడ్ మోస్ట్ హైపుడ్ మూవీ దురంధర్ 2 విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా మార్చి 19న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దురంధర్ 2 ట్రైలర్: సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్!

Dhurandhar 2: బాలీవుడ్ మోస్ట్ హైపుడ్ మూవీ దురంధర్ 2 విడుదలకు సిద్ధం అయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా దురంధర్: ది రివేంజ్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 3 నిమిషాలకు పైగా నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. దురంధర్ కి మించిన యాక్షన్ కంటెంట్ తో ఈ సినిమా రానుంది అన్ని క్లియర్ గా అర్థమవుతోంది. అయినప్పటికి, కంటెంట్ మాత్రం కొంచం రివీల్ కాకుండా చాలా బాగా కట్ చేశారు ట్రైలర్.

ఇక ట్రైలర్ చివర్లో ఇక పాకిస్థాన్ భవిష్యత్తు ఇప్పుడు ఇండియా చేతుల్లో అంటూ వచ్చిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దాంతో, ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ఇక, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ చేశారు. అలాగే ఒకరోజు ముందు పైడ్ ప్రీమియర్స్ కి సంబందించిన బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు. దాంతో, ప్రీమియర్ షో టికెట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది.

ప్రీమియర్ షోలకు భారీ డిమాండ్: టికెట్ల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్!

బుకింగ్ ఓపెన్ అయినా కొన్ని క్షణాల్లోనే ఏకంగా 90 వేలకు పైగా టికెట్స్ అబ్బురయ్యాయట. ఈ విషయాన్ని ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది. అఫీషియల్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయితే ఈ సంఖ్యా ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం. దురంధర్ 2 (Dhurandhar 2)సినిమాకు విడుదలకు ముందే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అనేది సంచలనంగా మారింది. ఈ డిమాండ్ చూస్తుంటే, మొదటిరోజు ఈ సినిమా రికార్డ్ లెవల్లో వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈసారి పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి బాక్సాఫీస్ మోత మోగిపోవడం ఖాయం.

పాన్ ఇండియా రిలీజ్‌తో దురంధర్ 2: బాక్సాఫీస్ షేకింగ్ ఖాయం!

ఇక దురంధర్ సినిమా విషయానికి వస్తే, కేవలం హిందీ భాషలోనే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి అంతకుమించిన హైప్ తో వస్తున్న దురంధర్ 2 మూవీ రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దురంధర్ 2 సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండటం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.