|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2 విధ్వంసం: ఫస్ట్ డే కలెక్షన్స్ తో షాక్! పుష్ప 2 రికార్డు బ్రేక్?

Published: 19-03-2026, 10:35 PM
దురంధర్ 2 విధ్వంసం: ఫస్ట్ డే కలెక్షన్స్ తో షాక్! పుష్ప 2 రికార్డు బ్రేక్?
  • దురంధర్ 2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్: బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్.. రికార్డుల మోత మోగిస్తోంది!
  • రణవీర్ సింగ్, సారా అర్జున్ ల మాస్ పెర్ఫార్మెన్స్ తో థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి!
  • తొలిరోజు దుమ్మురేపిన కలెక్షన్స్ – తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబట్టింది.
  • పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తున్న దురంధర్ 2 మూవీ.

రణవీర్ సింగ్, సారా అర్జున్ నటించిన దురంధర్ 2 మూవీ విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సినిమా రికార్డుల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి!

దురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్

Dhurandhar 2 : రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా వచ్చిన సూపర్ హిట్ సినిమా దురంధర్ కు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ మార్చ్ 19న రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు వసూలు చేసింది. సినిమాతో పాటు, సినిమాలోని కంటెంట్ పై జనాల్లో ఫుల్ హైప్ ఉండటంతో పార్ట్ 2 కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.

ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో దురంధర్ 2 దూసుకుపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ షాక్ అయ్యేలా అదిరిపోయింది సినిమా. దీంతో దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాని చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ముందు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు రావడంతో కేవలం హిందీలోనే రిలీజ్ చేసారు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాకు భారీగానే బుకింగ్స్ అయ్యాయి.

రణవీర్, సారా ల మాస్ పెర్ఫార్మెన్స్ అదుర్స్!

బాలీవుడ్ సమాచారం ప్రకారం ధురంధర్ 2 సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి దాదాపు 172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కేవలం ప్రీమియర్స్ నుంచే 43 కోట్లకు పైగా గ్రాస్ దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక మొదటి రోజు ఆల్మోస్ట్ 130 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాకు దాదాపు 33 వేల షోలకు పైగా పడ్డాయి. హిందీలోనే ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజే. కేవలం తెలుగులోనే రెండు వేల షోలు పడగా దాదాపు 3 కోట్ల వరకు కేవలం హిందీ లాంగ్వేజ్ తోనే కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమా ప్రీమియర్స్ నుంచే పడి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మరో 10 కోట్ల వరకు ఈజీగా పెరిగేవి. అయితే మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించలేదు.

ఇండియాలో ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ప్రస్తుతం పుష్ప 2 సినిమా 294 కోట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత RRR, బాహుబలి, కల్కి సినిమాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ 2 మూవీ వసూళ్ల సునామీ!

గమనిక : ఈ కలెక్షన్స్ సమాచారం పలు బాలీవుడ్ వెబ్ సైట్స్, బాలీవుడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీసుకున్న సమాచారం.

దురంధర్ 2 మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. ఈ సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.