|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ధురంధర్ 2’ సెన్సార్ పూర్తి! తెలుగులో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ!

Published: 19-03-2026, 7:05 AM
షాకింగ్: 'ధురంధర్ 2' సెన్సార్ పూర్తి! తెలుగులో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ!
  • రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో ‘ధురంధర్ 2’ చిత్రం!
  • హిందీలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘ధురంధర్’ మొదటి భాగం సంచలనం!
  • తెలుగు, మలయాళ భాషల్లో సెన్సార్ పూర్తి, త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
  • ప్రపంచవ్యాప్తంగా హిందీ వర్షన్ విడుదల, పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘ధురంధర్ 2’!

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది! మొదటి భాగం భారీ విజయం సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకి పండగే!

‘ధురంధర్ 2’ సెన్సార్ పూర్తి!

కొంతకాలం క్రితం ధురంధర్ మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విడుదలయ్యే సమయానికి ఈ మూవీపై హిందీ ప్రేక్షకుల్లో మినహాయిస్తే బయట పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే చిత్రం విడుదల అయిందో దానికి అద్భుతమైన టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్లు పెరగడం మొదలైంది. దాదాపు 50 రోజులపాటు ఈ చిత్రానికి స్టడీగా కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా ఈ మూవీ వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను కేవలం హిందీ భాష నుండే రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మొదటి భాగం!

ఈ చిత్రం రెండవ భాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతోమంది ఎదురుచూస్తూ వచ్చారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన రెండవ భాగం విడుదలయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ మాత్రం ఈరోజు విడుదల కాలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు, మలయాళ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. దానితో ఈరోజు ఈవినింగ్ లేదా సెకండ్ షో నుండి ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో విడుదల ఎప్పుడంటే?

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వర్షన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. దీనికి అద్భుతమైన పాజిటివ్ టాక్ దక్కింది. దాంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనబడుతుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.

‘ధురంధర్ 2’ చిత్రం తెలుగులో విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అంచనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.