
📌 Key Points
- దురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ వాయిదా.. చంద్ర గ్రహణమే కారణం!
- మార్చి 3న ట్రైలర్ విడుదల కావాల్సింది.. అభిమానుల్లో నిరాశ.
- దురంధర్ ది రివెంజ్ ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో ఎదురుచూపులు!
- గ్రహణం కారణంగా అశుభ సమయమని విడుదల నిలిపివేసిన మూవీ టీమ్.
దురంధర్ 2 ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల తేదీ వాయిదా పడింది. అసలు కారణం ఏమిటంటే…
చంద్ర గ్రహణం ఎఫెక్ట్: ట్రైలర్ రిలీజ్ వాయిదా!
Dhurandhar 2 Trailer: బ్లాక్ బస్టర్ సీక్వెల్ ధురంధర్ 2 పై హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ ట్రైలర్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 3 ట్రైలర్ రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ చంద్ర గ్రహణం ఎఫెక్ట్ కారణంగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది.
ధురంధర్ 2 ట్రైలర్ ఎక్కడ?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రశ్న వైరల్ గా మారింది. నిజానికి మార్చి 3న ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ తీరా ఒక రోజు గడిచినా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ధురంధర్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేయలేదని తెలిసింది.
మార్చి 3న విడుదల కావాల్సింది.. కానీ!
ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంది. జ్యోతిష్యపరంగా ఉదయం 9:39 గంటల నుంచే అశుభ కాలం మొదలైందని అంటున్నారు.
దురంధర్ 2 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్
చంద్ర గ్రహణం కారణంగా దురంధర్ 2 ట్రైలర్ విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


