|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణవీర్ vs యష్: ఉగాదికి బాక్సాఫీస్ బద్దలు! ఫైట్ ఫిక్స్!

Published: 03-02-2026, 5:35 AM
రణవీర్ vs యష్: ఉగాదికి బాక్సాఫీస్ బద్దలు! ఫైట్ ఫిక్స్!
  • రణవీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్ 2’, మార్చి 19న విడుదల కానుంది – బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ!
  • కేజిఎఫ్ తర్వాత యశ్ నటించిన ‘టాక్సిక్’ మూవీ కూడా మార్చి 19నే విడుదల కాబోతోంది – ఉగాదికి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం!
  • అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా ‘డెకాయిట్’ మూవీ కూడా అదే రోజు రిలీజ్ – టాలీవుడ్‌లో గట్టి పోటీ తప్పదు!
  • ‘ధురంధర్’ సినిమా బాలీవుడ్‌లో 800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది – సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! ఈ ఉగాదికి థియేటర్స్ దగ్గర పండగే పండగ. ఎందుకంటే రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. రికార్డులు బద్దలు కావడం ఖాయం!

ఉగాదికి బాక్సాఫీస్ వార్ ఫిక్స్!

Dhurandhar 2 Vs Toxic : ఈ ఉగాదికి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ పోరే జరగనుంది. రెండు పాన్ ఇండియా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకటి సూపర్ హిట్ ధురంధర్ సినిమాకి సీక్వెల్ కాగా ఇంకోటి టాక్సిక్.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ సినిమా భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ సినిమా 800 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. పాకిస్థాన్ కి వెళ్లిన ఇండియా స్పై కథాంశంతో దేశభక్తి, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ధురంధర్ సినిమా కేవలం హిందీలోనే రిలీజయినా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించింది.

‘ధురంధర్ 2’ వర్సెస్ ‘టాక్సిక్’!

ధురంధర్ రిలీజయిన మూడు నెలల్లోనే ధురంధర్ 2 కూడా వచ్చేస్తుంది. తాజాగా ధురంధర్ 2 టీజర్ రిలీజ్ చేసి సినిమా మార్చ్ 19న రిలీజ్ కానుందని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు మిగతా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈసారి పాన్ ఇండియా భాషల్లో ధురంధర్ 2 రిలీజ్ కానుందని తెలుస్తుంది.

అయితే అదే మార్చ్ 19 న కేజిఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న టాక్సిక్ సినిమా రాబోతుంది. గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న టాక్సిక్ నుంచి ఇప్పటికే రిలీజయిన్స్ గ్లింప్స్ తో అంచనాలు నెలకొన్నాయి. అందులోను యశ్ కేజిఎఫ్ తర్వాత వస్తుండటంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. టాక్సిక్ కూడా మార్చ్ 19 నే రిలీజ్ కాబోతుంది. దీంతో ఈసారి మార్చ్ 19 ఉగాది నాడు పాన్ ఇండియా ఫైట్ తప్పేలా లేదు. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.

టాలీవుడ్ లో ‘డెకాయిట్’ పోటీ!

అయితే అదే రోజు తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమా కూడా మార్చ్ 19 నే రిలీజ్ కానుంది. ఈ సినిమాకి తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి కేవలం తెలుగులోనే రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ లో దురంధర్ 2 కి, టాక్సిక్ కి డెకాయిట్ సినిమా గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

ఈ మూడు సినిమాలు మార్చి 19న విడుదల కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.