|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు: పాన్ ఇండియా నిర్మాతలకు ‘ధురంధర్’ షాక్!

Published: 25-12-2025, 12:07 AM
రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు: పాన్ ఇండియా నిర్మాతలకు 'ధురంధర్' షాక్!
  • ఆర్జీవీ ‘ధురంధర్’ సినిమా విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • పెద్ద సినిమాలు చేసే దర్శకులు ‘ధురంధర్’ విజయాన్ని మర్చిపోవాలని చూస్తున్నారు.
  • పాన్ ఇండియా సినిమాల పాత ఫార్ములాలు ఇప్పుడు పనిచేయవని ఆర్జీవీ అభిప్రాయం.
  • ‘ధురంధర్’ విజయంతో ఇతర నిర్మాతలు భయపడుతున్నారని వర్మ విశ్లేషణ.

రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల భారీ విజయం సాధించిన ‘ధురంధర్’ సినిమాపై స్పందిస్తూ, పాన్ ఇండియా చిత్రాల నిర్మాతలు భయపడుతున్నారని తెలిపారు. పాత ఫార్ములాలు ఇకపై పనికిరావని ఆర్జీవీ విశ్లేషించారు.

ఆర్జీవీ సంచలన పోస్ట్ వెనుక కారణం

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar)చూసిన ఆర్జీవీ నిత్యం సంచలన పోస్టులు పెడుతూ ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలకు కౌంటర్ వేస్తున్నారు. తాజాగా, ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. పెద్ద చిత్రాలను తెరకెక్కించే దర్శకులు భయపడుతున్నారంటూ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ‘ధూరంధర్’ లాంటి సంచలనాత్మకంగా భారీ విజయం సాధించిన సినిమా వచ్చినప్పుడల్లా, పరిశ్రమలోని చాలామంది దానిని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవాలనుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఆ మూవీ స్థాయికి తాము సరిపోలేమనే భయంతో అలా చేస్తుంటారు.

‘ధురంధర్’ ఎందుకు పెద్ద సినిమాలకు ముప్పు?

అందుకే దానిని ఒక ముప్పుగా, ఒక అసౌకర్యకరమైన నిజంగా భావిస్తారని అన్నారు. తమ సినిమాల ప్రపంచంలోకి అది చొరబడకుండా ఉండాలనే ఆశతో, “ఇది ఒక కల మాత్రమే, మేల్కొంటే మాయమైపోతుంది” అన్నట్టుగా ప్రవర్తిస్తారని అన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న పాన్-ఇండియా సినిమాల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోందని అవన్నీ ‘ధురంధర్’ విడుదలకు ముందే రూపొందిన ఆలోచనలపై, అప్పట్లో పనిచేస్తాయని నమ్మిన ఫార్ములాలపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం మెగా హిట్ మాత్రమే కాదు.. గత 50 ఏళ్లలోనే అత్యంత చర్చనీయాంశంగా మారిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఓ ఉదాహరణ చెబుతూ.. మనలో చాలామందికి ఒక అనుభవం ఉంటుంది. ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు అక్కడ పెద్ద కుక్క కనిపిస్తే, యజమాని “అది ఏమీ చేయదు” అని చెప్పినా మనలో భయం తగ్గదు. దానిని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించినా, కళ్ల మూలతో అయినా దానిపైనే దృష్టి ఉంటుంది.

పాత ఫార్ములాలు వర్కౌట్ అవ్వవా?

ఇప్పుడు అదే పరిస్థితి ప్రతి పెద్ద సినిమా నిర్మాణ కార్యాలయంలోనూ కనిపిస్తోందని చెప్పారు. అక్కడ ‘ధురంధర్’ భయపెట్టే కుక్కలా తిరుగుతోంది. దాని పేరు కూడా ప్రస్తావించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.. కానీ అది వారి ఆలోచనలన్నింటిలోనూ తిరుగుతూనే ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. VFXలు, భారీ సెట్లు, ఐటమ్ సాంగ్స్, హీరో ఆరాధన వంటి పాత ఫార్ములాలనే నమ్ముకున్న నిర్మాతలకు ‘ధురంధర్’ నిజంగా ఒక హారర్ సినిమాలా మారిందని అనడం గమనార్హం. వారు ఎంతగా కోరుకున్నా ఆ “కుక్క” అక్కడి నుంచి పోదు. వారి తదుపరి సినిమా విడుదలయ్యే ప్రతిసారి.. ‘ధురంధర్’ మళ్లీ ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తుందని అన్నారు. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు.. సినిమా ఆలోచనా విధానానికే విసిరిన సవాల్’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి.

‘ధురంధర్’ వంటి విజయాలు సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. పాత ధోరణులను మార్చుకోకపోతే పెద్ద చిత్రాలకు భవిష్యత్తు ఉండదని ఆర్జీవీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చర్చ తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.