
📌 Key Points
- ధురంధర్ మూవీ టికెట్ల అమ్మకాల్లో నంబర్ 1 హిందీ సినిమాగా నిలిచింది.
- ఈ సినిమా 1.3 కోట్ల టికెట్లు అమ్మి జవాన్, ఛావా రికార్డులను అధిగమించింది.
- అయితే, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ 2 కోట్ల టికెట్ల రికార్డు ఇంకా పదిలంగా ఉంది.
- రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ఇప్పటికే రూ. 1100 కోట్లు వసూలు చేసింది.
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ హిందీలో టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. నంబర్ 1 సినిమాగా నిలిచినా, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సృష్టించిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమా టికెట్ల రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. ఈ రికార్డుల పోరు వివరాలు చూడండి.
ధురంధర్ రికార్డుల పరంపర
ధురంధర్ మూవీ రికార్డుల పరంపరం కొనసాగుతూనే ఉంది. తాజాగా టికెట్ల అమ్మకాల్లో నంబర్ 1 హిందీ సినిమాగా నిలిచింది. అయితే మన పుష్ప 2 టికెట్ల అమ్మకాల కంటే ఇప్పటికీ చాలా వెనుకబడే ఉండటం విశేషం.
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ దగ్గర అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తూనే ఉంది. ఇప్పటికే రూ. 1100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఇప్పుడు టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షో (BookMyShow)లో అత్యధిక టికెట్లు అమ్ముడైన బాలీవుడ్ సినిమాగా నిలిచి.. షారుక్ ఖాన్ ‘జవాన్’, విక్కీ కౌశల్ ‘ఛావా’ రికార్డులను బద్దలు కొట్టింది.
బుక్ మై షోలో ‘నంబర్ 1’.. కానీ పుష్ప రాజ్ రికార్డు సేఫ్
బుక్ మై షోలో నంబర్ 1, కానీ పుష్ప రాజ్ రికార్డు సేఫ్
ధురంధర్ మూవీ ఇప్పటివరకు 1.3 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇది ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ హిందీ సినిమాగా నిలిచింది. గతంలో విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ (1.25 కోట్లు), షారుక్ ఖాన్ ‘జవాన్’ (1.24 కోట్లు), ‘స్త్రీ 2’ (1 కోటి+) రికార్డులను ‘ధురంధర్’ దాటేసింది.
అయితే ఓవరాల్‌గా ఇండియన్ సినిమా రికార్డు మాత్రం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ పేరు మీదే ఉంది. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఏకంగా 2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ రికార్డును అందుకోవడానికి ‘ధురంధర్’ ఇంకా చాలా దూరంలో ఉంది.
1100 కోట్ల సామ్రాజ్యం.. ధురంధర్ పార్ట్ 2
ధురంధర్ 1100 కోట్ల సామ్రాజ్యం
పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ కథతో, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా, అక్షయ్ ఖన్నా విలన్‌గా, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ కథకు ముగింపునిచ్చే ‘ధురంధర్ పార్ట్ 2’ ఇదే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.
రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ హిందీలో నంబర్ 1 గా నిలిచినా, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ టికెట్ల రికార్డును అధిగమించలేకపోయింది. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ప్రయాణం సినీ అభిమానులకు ఆసక్తిని పంచుతోంది.


